Salman Khan plans private party to celebrate Sanjay Dutt's release

Sanjay dutt s release bash at salman khan s panvel farmhouse

salman khan, sanjay dutt, toifa 2016, sanjay salman, salman party, pavel farm house, toifa, toifa 2016 news, toifa 2016 salaman, toifa 2016 dubai, toifa 2016 dubai news, salman khan news, salman khan film, salman khan upcoming film, entertainment news

Superstar Salman Khan will reportedly attend the upcoming second edition of Times of India Film Awards.

.. విడుదలైన మున్నాభాయ్ కి సల్లూభాయ్ దావత్

Posted: 02/25/2016 06:01 PM IST
Sanjay dutt s release bash at salman khan s panvel farmhouse

బాలీవుడ్ మున్నాబాయ్ సంజయ్ దత్ ఇవాళ తన శిక్షాకాలాన్ని ముగించుకుని యెర్రవాడ జైలు నుంచి విడుదల కావడంతో ఆయన విడుదలను స్వాగతిస్తూ బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ పార్టీ ఇస్తున్నాడు. బాలీవుడ్లో వీరిద్దరూ చిరకాల మిత్రులన్న విషయం చాలా మందికి తెలుసు. ఇరు కుటుంబాల మధ్య కూడా ఏళ్లుగా సత్సంబంధాలున్నాయి. క్లిష్ల పరిస్థితుల్లో సల్మాన్ సంజయ్కు వెన్నుదన్నుగా నిలిచారు. అక్రమాయుధాల కేసులో 42 నెలలుగా ఎరవాడ జైలులో శిక్ష అనుభవించిన సంజయ్ దత్ గురువారం విడుదలైన సందర్భంగా సల్లూ భాయ్ ఆయనకు గ్రాండ్ పార్టీ ఇవ్వనున్నారు.

సల్మాన్కు చెందిన పాన్వెల్ ఫామ్ హౌస్లో కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల మధ్య స్నేహితుడితో సంతోషాన్ని పంచుకోబోతున్నారు. సల్మాన్ ఈ రోజు సాయంత్రం సర్ ప్రైజ్ పార్టీని ఏర్పాటు చేశారు. అనంతరం సల్మాన్ 'సుల్తాన్' షూటింగ్ కోసం హరియాణా వెళ్తారు. సంజయ్ కూడా వెంటనే తన ప్రాజెక్టులు పూర్తి చేసే పనిలో పడతారని ఆయన చెల్లెలు ప్రియా దత్ వివరించారు. కాగా విడుదల అనంతరం సంజయ్ దత్ భావోద్వేగంతో కన్నీటి పర్యంతమయ్యారు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sanjay Dutt  Salman khan  Party  pavel farm house  

Other Articles