Suresh Prabhu announce minor projects and allot less budget for Telugu states

Suresh prabhu announce minor projects and allot less budget for telugu states

AP, Telangana, Railways, Suresh Ptrabhu, Railway Budget, Railway Budget 2016-17

Suresh Prabhu announce minor projects and allot less budget for Telugu states

తెలుగు రాష్ట్రాలకు రైల్వే కేటాయింపులు ఇవే..

Posted: 02/25/2016 03:46 PM IST
Suresh prabhu announce minor projects and allot less budget for telugu states

ఈ రోజు రైల్వే మంత్రి సురేష్ ప్రభు ప్రవేశపెట్టిన 2016-17 రైల్వే బడ్జెట్ తెలుగు రాష్ట్రాలకు నిరాశనే మిగిల్చాయి.కాజీపేట రైల్వే కోచ్ అంశాన్ని ప్రస్తావించనే లేదు. యాదాద్రి వరకు ఎంఎంటీఎస్ పొడిగింపు ప్రస్తావనే లేదు. పెద్దపల్లి - కరీంనగర్- నిజామాబాద్, మనోహరాబాద్ - కొత్తపల్లి, భద్రాచలం - సత్తుపల్లి కొత్త లైన్ల కల సాకారం కాలేదు. పార్లమెంట్ లో రైల్వే బడ్జెట్ ప్రవేశపెట్టిన రైల్వే మంత్రి సురేష్ ప్రభు విశాఖ రైల్వే జోన్‌ ఊసెత్తలేదు. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ కు కొత్త రైళ్లు ప్రకటించలేదు. కాగా కంటి తుడుపుగా తెలుగు రాష్ట్రాలకు కొన్ని కేటాయింపులు చేశారు.
 
తెలుగు రాష్ట్రాలకు రైల్వే ప్రాజెక్టులకు కేటాయింపులు :

* కోటిపల్లి-నరసాపురం రైల్వేలైన్‌కు రూ.200 కోట్లు
* పిఠాపురం-కాకినాడకు రైల్వేలైన్‌కు రూ.50 కోట్లు
* పెద్దపల్లి-నిజామాబాద్ రైల్వే లైన్‌కు రూ.70 కోట్లు
* మునీరాబాద్-మహబూబ్ నగర్ రైల్వే లైన్‌కు 180 కోట్లు
* మాచర్ల-నల్గొండ రైల్వే లైన్‌కు రూ.20 కోట్లు
* కాజీపేట-విజయవాడ మూడో రైల్వే లైన్‌కు 114 కోట్లు
* రాఘవాపురం-మందమర్రి రైల్వే లైన్‌కు రూ.15 కోట్లు
* సికింద్రాబాద్-మహబూబ్ నగర్ డబ్లింగ్‌కు రూ.80 కోట్లు
* పెద్దపల్లి-జగిత్యాల సబ్‌వే నిర్మాణానికి రూ.5 కోట్లు
* కాజీపేట- వరంగల్‌ మధ్య ఆర్‌వోబీ నిర్మాణానికి రూ.5 కోట్లు
* మనోహరాబాద్‌-కొత్తపల్లి లైన్‌కు రూ.20 కోట్లు
* నిజామాబాద్‌ ఓవర్‌ బ్రిడ్జి నిర్మాణానికి రూ.10 కోట్లు
* బోధన్‌-బీదర్‌ కొత్త లైన్‌ మంజూరు

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : AP  Telangana  Railways  Suresh Ptrabhu  Railway Budget  Railway Budget 2016-17  

Other Articles