Soon to be launched Gatiman Express to have train hostesses

Train hostesses to welcome travellers with roses

indian railways, indian railways hostess service, suresh prabhu, train hostess, semi-high speed train, roses, Gatiman Express,Train hostesses, Delhi-Agra Gatiman expres

Imagine being ushered into a train by a hostess who presents you a rose bud as soft music plays in the background.

త్వరలో గులాబీలను ఇచ్చి.. ప్యాసెంజర్లు ఆహ్వానించనున్న ట్రైన్ హాస్టెస్

Posted: 02/21/2016 06:15 PM IST
Train hostesses to welcome travellers with roses

బ్యాక్ గ్రౌండ్ లో వినసొంపైన సంగీతం వినిపిస్తుండగా, ట్రెయిన్ హోస్టెస్ లు గులాబీ పువ్వు ఇచ్చి రైలు ప్రయాణికులకు ఆహ్వానం పలికే రోజులు త్వరలో రానున్నాయి. ఢిల్లీ-ఆగ్రాల మధ్య నడిచే మొదటి సెమీ హైస్సీడ్ రైలు 'గతిమాన్ ఎక్స్ ప్రెస్'లో ట్రెయిన్ హోస్టెస్ ల ఏర్పాటు కు రైల్వేశాఖ సన్నాహాలు చేస్తోంది. క్యాటరింగ్ సర్వీసుతో పాటు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయనుంది. మార్చిలో ఈ రైలు సర్వీసులు ప్రారంభించనున్నట్లు సమాచారం.

లైవ్ టీవీ, ఆటోమేటిక్ ఫైర్ అలారం, హై-పవర్ అత్యవసర బ్రేకింగ్ సిస్టమ్ వంటి సౌకర్యాలు ఈ రైల్లో వుంటాయి. అయితే, ఈ రైల్లో టికెట్ ధర శతాబ్ది ఎక్స్ ప్రెస్ ధర కంటే సుమారు 25 శాతం ఎక్కువగా ఉంటుంది. ఈ తరహా రైళ్లను కాన్పూర్-ఢిల్లీ, ఛండీగఢ్-ఢిల్లీ, హైదరాబాద్-చెన్నై, నాగపూర్-బిలాస్ పూర్, గోవా-ముంబయి, నాగపూర్- సికింద్రాబాద్ ల మధ్య నడిపేందుకు రైల్వే శాఖ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. కాగా, వచ్చే రైల్వే బడ్జెట్ లో ఇందుకు సంబంధించిన వివరాలను మంత్రి సురేశ్ ప్రభు ప్రకటించనున్నారు.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : indian railways  hostess  suresh prabhu  Gatiman Express  

Other Articles