Virender Sehwag appeals to jat agitators for peace

Jat virender sehwag asks for calm on violent agitation

virender sehwag, sehwag jat, sehwag twitter, sehwag tweet, jat agitation, jat reservations, sehwag appeal, sports, cricket news, cricket

Virender Sehwag made an appeal to the jats to end their violent agitation for reservation, saying that people of the community are saviours.

హింసాత్మక అందోళనలకు పాల్పడవద్దని జాట్ లకు వీరూ వినతి

Posted: 02/21/2016 04:48 PM IST
Jat virender sehwag asks for calm on violent agitation

విద్య, ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్ల కోసం హర్యానాలో జాట్ ల ఆందోళన హింసాత్మకంగా మారిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్ వీరేందర్ సెహ్వాగ్ ఆందోళన వ్యక్తం చేశాడు. విధ్వంసకాండకు పాల్పడవద్దంటూ జాట్ లకు ఆయన విజ్ఞప్తి చేశాడు. ఈ మేరకు ఆయన ఒక ట్వీట్ చేశాడు. రాజ్యాంగబద్ధంగా నడుచుకుంటూ రిజర్వేషన్ల అంశంపై పోరాడాలని సెహ్వాగ్ సూచించాడు. సెహ్వాగ్ జాట్ కులానికి చెందిన వ్యక్తి అన్న సంగతి చాలా మందికి తెలిసిందే.

కాగా, హర్యానాలో రోహ్ తక్, భివానీ, జింద్, హిస్సార్ తదితర జిల్లాల్లో జాట్ ల ఆందోళన హింసాత్మకంగా మారిన విషయం తెలిసిందే. దీంతో ప్రభుత్వం కర్ఫ్యూ కూడా విధించింది. శుక్రవారం రాత్రి రోహ్ తక్ లో హర్యానా ఆర్థిక మంత్రి ఇంటికి నిప్పు పెట్టడంతో పాటు పలు హింసాత్మక ఘటనలకు పాల్పడ్డారు.. ఈ నేపథ్యంలో పలు రైళ్ల ను రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. దీంతో ఈ అందోళనపై స్పందించిన వీరేంద్ర సేహ్వాగ్ ఈ విధంగా స్పందించారు.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : virender sehwag  jat agitation  reservation  appeal  

Other Articles