firing going on at kashmir

Firing going on at kashmir

Kashmir, Terrorist, Jammu kashmir, Soldiers

The encounter has been on for more than 20 hours now. Three to five terrorists are still holed up in the complex, say security officers. Captain Tushar Mahajan, 26, a resident of Jammu's Udhampur, was hit by a volley of bullets while mop-up operations were being conducted at the third floor of the house the terrorists have been holed up in since yesterday.

కాశ్మీర్ లో కొనసాగుతున్న కాల్పులు.. టెన్ఫన్ టెన్షన్

Posted: 02/22/2016 08:19 AM IST
Firing going on at kashmir

కాశ్మీర్ మరోసారి హింసాత్మకంగా మారింది. ప్రస్తుతం కాశ్మీర్ లో తుపాకుల మోత మోగుతోంది.ప్యాంపోర్ సమీపంలో భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయి. శనివారం సీఆర్ పీఎఫ్ వాహనంపై దాడి చేసి ముగ్గురు జవాన్ల మృతికి కారణమయ్యారు ఉగ్రవాదులు. దీంతో కాశ్మీర్ లోని ప్యాంపోర్ ప్రాంతం టెర్రరిస్టులు, ఆర్మీ కాల్పులతో టెన్షన్ పెట్టిస్తోంది. ఉగ్ర దాడులకు కాశ్మీర్ మరోసారి వేదికైంది. ప్యాంపోర్ సమీపంలో గత రెండ్రోజుల నుంచి భద్రతాదళాలు, ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు జరుగుతున్నాయి. మొన్న పఠాన్ కోట్ ఘటనను మరువక ముందే మరో ఎటాక్ కు స్కెచ్ వేశారు ఉగ్రవాదులు. శనివారం సీఆర్ పీఎఫ్ వాహనంపై ఉగ్రవాదులు దాడి చేయడంతో ముగ్గురు జవాన్లతో పాటు ఓ పౌరుడు మృతి చెందారు. దీంతో ఉగ్రవాదులపై ఎదురుదాడి చేసేందుకు జవాన్లు యత్నించడంతో వారంతా ఓ ప్రభుత్వ భవనంలోకి వెళ్లి దాక్కున్నట్లు జవాన్లు గుర్తించారు.

ఉగ్రవాదులు దాగి ఉన్న ఈఐడీ బిల్డింగ్ వద్దకు చేరకున్న భద్రతా బలగాలు.. అందులోనే ఉన్న 115మంది పౌరులను ఉగ్ర చెర నుంచి రక్షించాయి. బిల్డింగ్ లో ఐదుగురు ఉగ్రవాదులు తలదాచుకున్నట్లు అంచనాకు వచ్చారు అధికారులు. దీంతో ఇరువర్గాల మధ్య జరిగిన కాల్పుల్లో ఏడుగురు మృతి చెందారు. ఉగ్రవాదులను మట్టుబెట్టే సమయంలో వాళ్ల తూటాలకు ఆర్మీ కెప్టెన్ తుషార్ మహజన్ తో పాటు ఆర్మీ అధికారి పవన్ కుమార్ మృతి చెందారు. వీరితో పాటు మరో ముగ్గురు జవాన్లలు, ఓ పౌరుడు మృతి చెందారు. మరో వైపు భద్రతాదళాలు ఓ ఉగ్రవాదిని హతమార్చాయి. 26 ఏళ్ల ఆర్మీ కెప్టెన్ తుషార్ మహజన్ ఉదంపూర్ కు చెందిన వాడు.

జమ్మూ-కాశ్మీర్ హైవేపై ప్యాంపోర్ సమీపంలోని ఈడీఐ బిల్డింగ్ లో ఎంతమంది ఉగ్రవాదులు ఉన్నారనే దానిపై పూర్తి క్లారిటీ లేకపోయినా... కాల్పులను బట్టి మరో ముగ్గురు, నలుగురు ఉన్నట్లు ఆర్మీ అధికారులు అంచనాకు వచ్చారు. ఉగ్రవాదులను మట్టుబెట్టేందుకు సైన్యం దాడులను ముమ్మరం చేసింది. టెర్రరిస్టులు దాగి ఉన్న భవనంపై భద్రతా దళాలు దాడులు చేశాయి. దీంతో ఆ బిల్డింగ్ పై అంతస్థులో మంటలు ఎగసిపడ్డాయి. టెర్రర్ ఎటాక్ లను సమర్థవంతంగా తిప్పికొట్టేందుకు భద్రతా దళాలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Kashmir  Terrorist  Jammu kashmir  Soldiers  

Other Articles