mudragada padmanabham takes on chandrababu

We wont sleep doesnt allow government sleep says mudragada

mudragada padmanabham, kapu leader, andhra pradesh government, chandrababu naidu, ap dgp, ap police boss, jv ramudu, mudragada gada gada, mudragada letter, mudragada letter to dgp, cases on kapus, kapu youth

After writing a letter to ap dgp jv ramudu, kapu leader mudragada padmanabham says we wont sleep, doesnt allow government sleep until reservations are done

ముద్రగడ నోట.. చంద్రబాబు మాట.. నిద్రపోనూ.. నిద్రపోనివ్వనూ..

Posted: 02/21/2016 04:04 PM IST
We wont sleep doesnt allow government sleep says mudragada

తెలుగుదేశం పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నోటి వెంట గత పదేళ్ల క్రితం నిత్యం జాలువారిన మాట.. నిద్రపోనూ.. నిద్రపోనివ్వను. సమైక్య రాష్ట్ర ముఖ్యమంత్రిగా తొమ్మిదేళ్ల పాటు వ్యవహరించిన సమయంలో ఒకటి రెండు సంవత్సరాలు తీసేస్తే.. అత్యంత అధికంగా ఆయన నోటి వెంట వచ్చిన మాట ఇది. అధికారులు పనులు చేయకపోయినా.. ప్రజలు సహకారం కావాలన్న ఆయన ఈ ఒక్క డైలాగుతోనే అందరినీ తన వైపుకు తిప్పుకున్నారని అనడంలో అతిశయోక్తి కాదేమో. అయితే ఇప్పుడితే మాట కాపు సంఘం నాయకుడు ముద్రగడ పద్మనాభం నోటి వెంట జాలువారింది.

కాపులకు రిజర్వేషన్లు కల్పించే వరకు తాము నిద్రపోమని... సీఎం చంద్రబాబును, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని కూడా నిద్రపోనివ్వమని ఆయన స్పష్టం చేశారు. ఆదివారం తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలో ముద్రగడ మాట్లాడుతూ...రిజర్వేషన్ల అంశాన్ని ప్రతి 10 రోజులకోసారి ఉత్తరాల రూపంలో చంద్రబాబుకు గుర్తు చేస్తామన్నారు.  బీసీలకు అన్యాయం జరగకుండా తమ కులానికి  రిజర్వేషన్లు కల్పించాలని ప్రభుత్వాన్ని ముద్రగడ డిమాండ్ చేశారు.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : mudragada padmanabham  kapu leader  andhra pradesh  government  

Other Articles