Just Two Days After Launch Of Freedom 251, Income Tax Department Raids Ringing Bells' Office

It department raids ringing bells noida office

freedom 251, buy freedom 251, freedom 251 website crash, freedom 251 registrations, ringing bells, ringing bells freedom 251, freedom 251 android smartphone, freedom 251 booking, freedom 251 specs, freedom 251 cheapest mobile, world cheapest mobile freedom 251, freedom 251 features, freedom 251 price in india, ringing bells india

Ringing Bells, the Noida company has woken up and come up with answers to the questions India is asking

ఫ్రీడం 251 తయారీ సంస్థ రింగింగ్ బెల్స్ కు ఐటీ షాక్..

Posted: 02/21/2016 02:15 PM IST
It department raids ringing bells noida office

సినిమా టిక్కెట్ ధరలో ఓ స్మార్ట్ ఫోన్ ను అందిస్తామని ప్రకటన చేయడమే కాకుండా బుకింగ్స్ కు తెరలేపిన వివాదాస్పద చౌక స్మార్ట్‌ఫోన్ ‘ఫ్రీడం’ తయారీ సంస్థ రింగింగ్ బెల్స్ కు అదాయ పన్ను శాఖ అధికారులు షాక్ ఇచ్చారు. ఆ సంస్థ కార్యకలాపాలపై ఎక్సైజ్, ఆదాయ పన్ను విభాగాలు దృష్టి సారించాయి. కంపెనీ కార్యాలయంలో సోదాలు నిర్వహించిన ఐటీ విభాగం కొన్ని కీలక పత్రాలు తీసుకున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఎక్సైజ్, ఐటీ విభాగం అధికారులు వచ్చిన సంగతి వాస్తవమేనని, వారు కొన్ని మార్గదర్శకాలు సూచించారని రింగింగ్ బెల్స్ ప్రెసిడెంట్ అశోక్ చద్ధా పేర్కొన్నారు. ఫ్రీడం బ్రాండ్ పేరిట రూ. 251కే స్మార్ట్‌ఫోన్ అందిస్తామంటూ రింగింగ్ బెల్స్ ఊదరగొట్టడం, దీని సాధ్యాసాధ్యాలపై సందేహాలు వ్యక్తమవడం తెలిసిందే.

మరోవైపు, ఈ చౌక స్మార్ట్‌ఫోన్ వ్యవహారంపై విచారణ చేయాలంటూ ఎలక్ట్రానిక్స్, ఐటీ విభాగం (డైటీ) కార్యదర్శి అరుణ శర్మను టెలికం శాఖ మంత్రి రవి శంకర్ ప్రసాద్ ఆదేశించారు. ఫ్రీడం ఫోన్ ధరపై సందేహాలు లేవనెత్తుతూ బీజేపీ ఎంపీ కిరీట్ సోమయ్య రాసిన లేఖకు స్పందనగా ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఫ్రీడం ఫోన్ విక్రయాలు తమపై ప్రభావం చూపబోవని మరో కంపెనీ డేటా విండ్ స్పష్టం చేసింది. ఫ్రీడమ్ 251 ఫోన్‌కి భారీ డిమాండ్ రావడంతో బుకింగ్స్‌ను నిలిపివేస్తున్నట్లు శనివారం సంస్థ ప్రకటించింది. తొలి రోజున 3.7 కోట్లు, రెండో రోజున 2.47 కోట్ల మేర రిజిస్ట్రేషన్లు జరిగాయని వివరించింది.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ringing Bells  Department of Telecom  Freedom 251  IT raids  

Other Articles