Trs activists builds temple to KCR on birthday

Adilabad trs fan builds a temple to kcr

kcr, telangana cm, trs, gunde ravinder, adilabad, dandepally, temple, kcr temple, puja to kcr, abhishekam, trs activist, silk fabric, dharmavaram, telangana cm, kcr birthday gift, weaver, handloom, rare gift for kcr, ananthapur fan gift to kcr, kcr birthday gift, dharmavaram shawl, shawl with kcr picture

After andhra ananthapuram fan presents a dharmavaram shawl to Telangana Chief Minister KCR, received a spectacular gift on his 63rd birthday on Wednesday in Hyderabad

హద్దులు మించిన అభిమానం.. కేసీఆర్ కు గుడికట్టిన అదిలాబాద్ వాసి

Posted: 02/18/2016 01:17 PM IST
Adilabad trs fan builds a temple to kcr

తన జన్మదిన రోజును పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ కు చెందిన అనంతపురం వాసి తెలంగాణ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావుకు అరుదైన అపురూప బహుమతని అందించాడు. ధర్మవరం పట్టు శాలువా మీద కేసీఆర్ దంపతుల ఫొటోలను చిత్రించిన శాలువాను ఓ అభిమాని బహుమతిగా ఇచ్చారు. అయితే అదిలాబాద్ కు చెందిన ఒక పార్టీ కార్యకర్త.. తన వీరాభామానానికి గుర్తుగా ఏకంగా కేసీఆర్ కు గుడి కట్టేశాడు.  ఆదిలాబాదు జిల్లా దండేపల్లి మండల కేంద్రానికి చెందిన రవీందర్... టీఆర్ఎస్ దండేపల్లి మండల అధికార ప్రతినిధిగా వ్యవహరిస్తున్నారు. అయితే కేసీఆర్ పై నున్న అభిమానం హద్దులు దాటడంతో ఆయన  తన సొంత ఇంటిలో గుడి కట్టారు. కేసీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఆయనకు పూజలు కూడా నిర్వహించడం ప్రారంభించారు

టీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి ఆ పార్టీలోనే ఉన్న రవీందర్... నిన్న కేసీఆర్ జన్మదినం సందర్భంగా తన ఇంటిలో తన అభిమాన నేతకు కట్టిన గుడిలో కేసీఆర్ విగ్రహాన్ని తన తండ్రి చేతుల మీదుగా ఆవిష్కరించారు. అనంతరం కుటుంబసభ్యులతో కలిసి కేసీఆర్ విగ్రహానికి క్షీరాభిషేకం చేశారు. ఇక ఇక్కడ మరో ఆసక్తికర అంశమేంటంటే... టీఆర్ఎస్ ఉద్యమం ప్రారంభమైన నాటి నుంచి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించేదాకా చోటుచేసుకున్న కీలక ఘటనలను తెలుపుతూ ఓ పాలరాతి శిలా ఫలకాన్ని కూడా గుడి పక్కనే ఏర్పాటు చేశారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : KCR birthday  gunde ravinder  adilabad  dandepally  temple  

Other Articles