Unknown person throug slipper on KTR

Unknown person throug slipper on ktr

KTR, Slipper on KTR, Telangana, GHMC, GHMC Elections

Unknown person in Hyderabad Amvberpet, through slipper on telangana minister KTR.

కేటీఆర్ మీదకు చెప్పు విసిరిన వ్యక్తి

Posted: 01/27/2016 09:28 AM IST
Unknown person throug slipper on ktr

తెలంగాణ మంత్రిగా, కేసీఆర్ కొడుక్కుగా కేటీఆర్ దూసుకెళుతున్నారు. జిహెచ్ఎంసీ ఎన్నికల బాధ్యతను భుజాల మీద వేసుకొని గల్లీ గల్లీ తిరుగుతూ విసృతంగా ప్రచారం చేస్తున్న కేటీఆర్ కు హైదరాబాద్ ఎన్నికల ప్రచారంలో ఛేదు అనుభవం ఎదురైంది. కేటీఆర్ మీదకు ఓ వ్యక్తి చెప్పు విసరడం తీవ్ర కలకలం రేపింది. హైదరాబాద్ అంబర్ పేట్ లె మమారానా ప్రతాప్ ఫంక్షన్ హాల్ లో సీనియర్ కాలేరు వెంకటేష్ ఆధ్వర్యంలో న్యాయవాదుల శంఖారావం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంత్రులు కేటీఆర్, నాయిని నర్సింహా రెడ్డి, మహేందర్ రెడ్డి, సీనియర్ నేత ఎంపీ కెకె, వినోద్ కుమార్, బూర సర్సయ్య గౌడ్, ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, మాజీ మంత్రి సి.కృష్ణయాదవ్ తదితరులు పాల్గొన్నారు. సభ జరుగుతుండగా న్యాయవాది ఒకరు మంత్రి కేటీఆర్ పై చెప్పు విసరగా అది స్టేజీపై పడింది.

కాగా ఆ చెప్పు మంత్రి కేటీఆర్ కు దగ్గరలో పడటంతో అందరూ షాకయ్యారు. వెంటనే స్టేజీ వద్ద ఉన్న భద్రతా సిబ్బంది అప్రమత్తమయ్యారు. అక్కడే ఉన్న హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి వెంటనే అతన్ని పట్టుకోమని ఆదేశించారు. అప్రమత్తమైన పోలీసులు వెంటనే న్యాయవాదిని అదుపులోకి తీసుకున్నారు. కాగా అతడు మతిప్థిమితంలేని వ్యక్తి అని న్యాయవాదులు చెప్పడంతో పోలీసులు అతడిని బయటకు పంపించేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : KTR  Slipper on KTR  Telangana  GHMC  GHMC Elections  

Other Articles