A girl attacked on Homeguard in keesara

A girl attacked on homeguard in keesara

Girl Attack on Home guard, Keesara

A Girl slaps a homeguard who took her picture for wrong route driving. She slap and create nuisance.

ITEMVIDEOS: హోంగార్డ్ చెంప ఛెళ్లుమనిపించిన యువతి

Posted: 01/27/2016 09:27 AM IST
A girl attacked on homeguard in keesara

ట్రాఫిక్ కానిస్టేబుల్ పై దౌర్జన్యానికి దిగింది ఓ యువతి. తప్పు చేయడమే కాకుండా… కానిస్టేబుల్ ను కొట్టడానికి దూసుకెళ్లింది. తన బాధ్యతను తాను నిర్వర్తిస్తున్న ట్రాఫిక్ సిబ్బందిని ఇష్టానుసారం మాట్లాడటమే కాకుండా.. కొట్టడానికి ప్రయత్నించింది. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా కీసరగుట్టలో జరిగింది. ఆ యువతి.. మరో యువకుడు బైక్ పై రాంగ్ రూట్లో వెళ్తుండగా ఫొటో తీశాడు ఓ హోంగార్డ్  దీంతో వెంటనే అక్కడ ఆగిన ఆ యువతి… ఏమాత్రం ఆలోచించకుండా కానిస్టేబుల్ కాలర్ పట్టుకుని చెంప చెల్లుమనిపించింది. అంతేకాదు పోట్లాటకు దిగింది. ఈ దృశ్యాలను వీడియో తీశారు కొందరు.

కీసర మండలంలోని దమ్మాయిగూడకు చెందిన అర్చిత ఇంజినీరింగ్ చదువుతోంది. నిన్న సాయంత్రం ఆమె తన ద్విచక్రవాహనంపై నాగారం గ్రామం మీదుగా స్వగ్రామానికి వెళ్లేందుకు రాంగ్‌రూట్‌లో వెళ్తోంది. దమ్మాయిగూడ చౌరస్తాలో విధులు నిర్వహిస్తున్న మల్కాజిగిరి ట్రాఫిక్ ఠాణాకు చెందిన హోంగార్డు వెంకటేష్ ఈ విషయం గమనించి తన వద్ద ఉన్న కెమెరాలో యువతి వాహనాన్ని ఫొటో తీశాడు. ఇది గమనించిన అర్చిత హోంగార్డుతో వాగ్వాదానికి దిగింది. తన ఫొటో ఎందుకు తీశావని ఆమె ప్రశ్నించగా.. రాంగ్‌రూట్‌లో వెళ్లినందుకు జరిమానా విధించేందుకు ఫొటో తీశానని వెంకటేష్ బదులిచ్చాడు. కెమెరా నుంచి ఫొటో తొలగించాలని ఆమె డిమాండ్ చేసింది. ఈక్రమంలో అతడితో గొడవకు దిగింది. హోంగార్డు కాలర్ పట్టుకొని చెంప చెల్లుమనిపించింది. అక్కడే ఉన్న కొందరి సమాచారంతో కీసర పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని యువతిని అదుపులోకి తీసుకొని ఠాణాకు తరలించారు. ఈమేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ వివరించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Girl Attack on Home guard  Keesara  

Other Articles