TDP Leaders build Charminar in Hyderbad

Tdp leaders build charminar in hyderbad

GHMC, nara Lokesh, Lokesh, GHMC Elections, KTR, KTR Vs Nara Lokesh

Telangana Minister KTR slam TDP Leaders comment on Hyderabad. may TDP Leaders says they built Charminar.

చార్మినార్ ను కట్టింది టిడిపి వాళ్లే..!

Posted: 01/25/2016 01:36 PM IST
Tdp leaders build charminar in hyderbad

గ్రేటర్ హైదరాబాద్ లో ఎన్నికల వేడి అంతకంతకు కాకపుట్టిస్తోంది. ఓ పక్క చలి మామూలు ప్ర.జలను ఒక్కిరిబక్కిరి చేస్తుంటే... గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా నాయకులు చేస్తున్న వ్యాఖ్యలు వేడిపుట్టిస్తున్నాయి. అయితే టిఆర్ఎస్ మీద తీవ్రంగా మండిపడుతూ.. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కుమారుడు నారా లోకేశ్ విమర్శల వర్షం కురిపించారు.  ఇద్దరి నాయకుల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. తాజాగా హైదరాబాద్ ఎన్నికల ప్రచారాన్ని భుజానికెత్తుకున్న నారా లోకేశ్ హైదరాబాద్ కీర్తి ప్రతిష్టలను పెంచింది.. తమ పార్టీనే అని వివరించారు. అందుకు ఓ ఉదాహరణ కూడా ఇస్తున్నారు.

గూగుల్ లో హైదరాబాద్ అని సెర్చ్ చేస్తే.. మూడు ఫోటోలు వస్తాయిని.. అందులో ఒకటి చార్ మినార్, రెండోది బుద్దుడి విగ్రహం.. ఇక మూడోది హైటెక్ సిటి అని నారా లోకేశ్ వెల్లడించారు. అయితే బుద్ద విగ్రహం ఏర్పాటు తమ పార్టీ అధినేత నందమూరి తారకరామారావు హయాంలో జరిగిందని.. అలాగే హైటెక్ సిటీ తన తండ్రి చంద్రబాబు నిర్వహించారని కూడా వివరించారు. హైదరాబాద్ ను అభివృద్ది చేసింది తామేనని.. కాబట్టి తమకు ఓటు వెయ్యాలని లోకేశ్ పిలుపునిచ్చారు. అయితే లోకేశ్ చేసిన వ్యాఖ్యల మీద కేటీఆర్ కౌంటర్ వేశారు. టిడిపి వాళ్లు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారపి.. చివరకు హైదరాబాద్ లో చార్మినార్ కట్టింది కూడా తామేనని చెబుతారని వ్యంగ్యంగా కామెంట్ చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : GHMC  nara Lokesh  Lokesh  GHMC Elections  KTR  KTR Vs Nara Lokesh  

Other Articles