President rule in Arunachal Pradesh

President rule in arunachal pradesh

arunachal pradesh, President rule, Pranabh Mukharjee, Modi, Congress, cabinet

The Congress Party on Monday dubbed the government's move to recommend President's rule in Arunachal Pradesh as 'unconstitutional' and alleged that it exposed the dictatorial tendencies of Prime Minister Narendra Modi and his people.

ఆ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన

Posted: 01/25/2016 01:01 PM IST
President rule in arunachal pradesh

అరుణాచల్ ప్రదేశ్ లో తాజాగా రాష్ట్రపతి పాలన విధిస్తూ ప్రెసిడెంట్ ప్రణబ్ ముఖర్జీ నిర్ణయం తీసుకోనున్నారు. గవర్నర్ జ్యోతిప్రసాద్ రాజ్ ఖోవా పంపిన నివేదిక ఆధారంగా రాష్ట్రపతి ఈ నిర్ణయం తీసుకోనున్నారు. ప్రధాని మోదీ నేతృత్వంలో జరిగిన కేబినెట్ సమావేశం తీసుకున్న నిర్ణయాన్ని రాష్ట్రపతి సమర్థించినట్లు సమాచారం. కాగా ఈ అంశంపై రాజకీయ దుమారం చెలరేగే అవకాశం ఉంది. అటార్నీ జనరల్‌తో జరిగిన సమావేశం తర్వాత కేంద్ర క్యాబినెట్ అరుణాచల్ ప్రదేశ్‌పై నిర్ణయం తీసుకుంది. రాజకీయ అనిశ్చితి నెలకొన్న కారణంగా ఆ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించేందుకు కేంద్రం సిద్ధమైన విషయం తెలిసిందే.

కేంద్ర నిర్ణయంపై అరుణాచల్ సీఎం నబం తుకీ ఆశ్చర్యం వ్యక్తంచేశారు. రాష్ట్ర క్యాబినెట్‌ను సంప్రదించకుండానే.. గవర్నర్ జ్యోతిప్రసాద్ రాజ్‌ఖోవా పంపిన నివేదిక ఆధారంగా కేంద్ర క్యాబినెట్ తీసుకున్న నిర్ణయం ప్రజాతంత్ర స్ఫూర్తిని దెబ్బ తీస్తుందన్నారు. 60 మంది సభ్యులు గల అరుణాచల్‌లోని 21 మంది కాంగ్రెస్ పార్టీ అసమ్మతి ఎమ్మెల్యేలు కేంద్రం నిర్ణయాన్ని స్వాగతించారు.మరోపక్క 11 మంది సభ్యులు గల బీజేపీ మద్దతుతో ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమని కాంగ్రెస్ అసమ్మతి ఎమ్మెల్యేల ప్రతినిధి పసాంగ్ దోర్జీ పీటీఐకి చెప్పారు. ఈ నెల 21 నాటికి ఆరు నెలలకు పైగా అసెంబ్లీ సమావేశాలు నిర్వహించనందున అక్కడ రాష్ట్రపతి పాలన విధించాల్సి వచ్చిందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిరెన్ రిజిజు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు మాత్రం దీని మీద మండిపడుతున్నారు.. అవసరమైతే సుప్రీంకోర్టుకు వెళతామని అంటున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : arunachal pradesh  President rule  Pranabh Mukharjee  Modi  Congress  cabinet  

Other Articles