Business with the photo of dead body

Business with the photo of dead body

Rohith, Hyderabad Central University, HCU, Rothith Suicide, Rohith Vemula, Rohith logo T Shirts

Ugly business men trying to cash the sentiments. On HCU Student Rohith Vemula suicide, they released a T Shirt and seling in the market.

చచ్చినోడి ఫోటోతో వ్యాపారం

Posted: 01/25/2016 03:05 PM IST
Business with the photo of dead body

ఇళ్లు కాలి ఒకడు ఏడుస్తుంటే... బాబాయ్ చుట్ట కాల్చుకోవడానికి నిప్పు దొరుకుతుందా అని అడిగాడట. ఇప్పుడు పరిస్థితి అలానే ఉంది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో పిహెచ్.డి చేస్తున్న విద్యార్థి రోహిత్ ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు. యూనివర్సిటీలో రాజకీయాల వల్లే అతడు ఆత్మహత్య చేసుకున్నాడని.. తీవ్ర దుమారం రేగుతోంది. యూనివర్సిటీ వైస్ ఛాన్స్ లర్ దగ్గరి నుండి కేంద్ర మంత్రుల వరకు ఎంతో మందికి ఈ ఆత్మహత్య మీద తీవ్ర నిరసనలు ఎదుర్కొంటున్నారు. చిరవకు దేశ ప్రధాని నరేంద్ర మోదీకి కూడా రోహిత్ ఆత్మహత్య సెగ తగిలింది. లక్నోలో మోదీ సభలో రోహిత్ ఆత్మహత్య మీద నిరసనకారులు నినాదాలు చేశారు.

అలా గచ్చిబౌలిలోని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ నుండి దిల్లీలోని మంత్రుల వరకు రోహిత్ ఆత్మహత్య వివాదం సెగ తగిలింది. దాంతో ఎప్పుడు ఏం జరుగుతుందో అన్న టెన్షన్. రోహిత్ మృతి మీద విద్యార్థులు కదం తొక్కారు.. విద్యార్థి ఆత్మహత్యకు కారకులైనా వారిని తీవ్రంగా శిక్షించాలంటూ నిరసన చేస్తున్నారు. అయితే దిల్లీ నుండి గల్లీ దాకా ఇలా విద్యార్థి ఆత్మహత్య మీద అట్టుడికిపోతుంటే.. కొంత మంది మాత్రం తమ స్వలాభాలను చూసుకుంటున్నారు.  కొంత మంది రాజకీయ నాయకులు ఇప్పటికే దీనికి రాజకీయ రంగు పులిమి పబ్బం గుడుపుకునే ప్రయత్నం చేశారు.. కాగా మరి కొంత మంది ఒక అడుగు ముందుకు వేసి... రోహిత్ ఫోటోను, రోహిత్ ఆత్మహత్య సెంటిమెంట్ ను ఎలా క్యాష్ చేసుకోవాలో కళ్లు చెమ్మగిల్లేలా చేస్తున్నారు.

శవాల మీద రాజకీయాలు చెయ్యడం గురించి విన్నాం.. కళ్లారా చూస్తున్నాం.. కానీ శవాల మీద చిల్లర ఏరుకునే వాళ్ల గురించి వినడమే తప్ప ఎన్నడూ చూసిన పాపనపోలేదు. కానీ తాజాగా హెచ్.సి.యు విద్యార్థి రోహిత్ వేముల ఆత్మహత్య ఘటనలో అలాంటి వారు కనిపిస్తున్నారు. అసలే విద్యార్థులు వారి సెంటిమెంట్ ను క్యాష్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అందుకే తాజాగా రోహిత్ బొమ్మలతో కొన్ని టీషర్టులను అమ్మకానికి పెట్టేశారు. ఆత్మహత్య చేసుకున్న రోహిత్ ఫోటోలను టీషర్టుల మీద ముద్రించి.. వాటిని మార్కెట్ లో అమ్మేస్తున్నారు.

విద్యార్థులు అంటే వారికి అన్నీ ఎక్కువే.. కోపం ఎక్కువ.. ఫీలింగ్ప్ ఎక్కువ.. అన్నింటికి మించి ఫ్యాషన్ ఎక్కువ. అయితే తాజాగా రోహిత్ ఆత్మహత్యతో విద్యార్థి లోకం దీని గురించే రగిలిపోతున్నారు. అయితే దీనిని ఎలా క్యాష్ చేసుకోవాలా అని ఎదురుచూసిన కొంత మంది మనీ మైండ్ గాళ్లు రోహిత్ ఫోటోతో టీషర్లును మార్కెట్ లోకి విడుదల చేశారు. ఒక్కో టీషర్లును రెండు వందల నుండి నాలుగు వందల వరుకు అమ్ముతున్నట్లు సమాచారం. సెంటిమెంట్ ను ఇలా కూడా క్యాష్ చేసుకుంటారా..? అంటే మార్కెట్ ఎనలిస్ట్ లు అవుననే అంటున్నారు. వ్యాపారానికి కాదేదీ అతీతం అంటూ వెధవ ఫిలాసఫీ చెబుతున్నారు.

ఐతే ఈ టీషర్టులు అమ్ముతున్న వాళ్లకు నా సలహా- మీరు టీషర్టులు అమ్ముకోకుండా.. రోహిత్ ఆత్మహత్యకు నిరసనగా వాటిని ఫ్రీగా స్టూడెంట్స్ కు ఇస్తే ఇంకా బాగుంటుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(2 votes)
Tags : Rohith  Hyderabad Central University  HCU  Rothith Suicide  Rohith Vemula  Rohith logo T Shirts  

Other Articles