TDP and BJP released manifesto on GHMC Elections

Tdp and bjp released manifesto on ghmc elections

TDP, BJP, GHMC, GHMC Elections, Free Wifi, Free setup box

TDP and BJP parties contesting jointly in the GHMC elections. For GHMC Elections, both parties released Manifesto.

మేనిఫెస్టోలో ఫ్రీగా వైఫై, సెటాప్ బాక్స్

Posted: 01/25/2016 09:13 AM IST
Tdp and bjp released manifesto on ghmc elections

గ్రేటర్ ఎన్నికల్లో అన్ని పార్టీలు గెలుపు కోసం విశ్వప్రయత్నాలు చేస్తున్నాయి. మరో వారంలో ఉన్న పోలింగ్ లో ఓటర్లు తమకే ఓటు వేసేలా ఆకర్షణీయ మేనిఫెస్టోలు ప్రకటిస్తున్నారు. అందులో భాగంగా తాజాగా టిడిపి-బిజెపి ఉమ్మడిగా గ్రేటర్ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశారు. అందులో పేదలందరికీ ఉచిత నల్లా కనెక్షన్.. పూర్తిస్థాయిలో వైఫై నగరంగా తీర్చిదిద్దడం.. ప్రతీ ఇంటికి ఉచితంగా సెట్‌టాప్ బాక్స్ అందజేస్తామని హామీ ఇచ్చాయి. హైదరాబాద్ నగరాన్ని విశ్వసనగరంగా తీర్చిదిద్దుతామని, ప్రతీ పేదవాడికి ఇల్లు కట్టించి ఇస్తామని పేర్కొన్నాయి. హైదరాబాద్ షహర్ హమారా విజన్ డాక్యుమెంట్ ఫర్ హ్యాపీ హైదరాబాద్ పేరుతో మిత్రపక్షాల నేతలు విడుదల చేశారు.

50 జంక్షన్లలో ఫ్లై ఓవర్లు నిర్మాణం... ప్రతీ ఇంటికి మంచినీరు- పేదలందరికీ ఉచిత నల్లా కనెక్షన్.. పూర్తిస్థాయిలో వైఫై నగరంగా తీర్చిదిద్దడం... ప్రతి పేదవాడికి పక్కా గృహ నిర్మాణం చేపట్టడం... యువత, మహిళలకు ఉపాధి అవకాశాలు.. బ్యాంకుల ద్వారా రుణ సౌకర్యం కల్పించడం... అన్ని ముఖ్యమైన కూడళ్లలో, ప్రభుత్వ దవాఖానాల్లో ఉచిత పార్కింగ్ సౌకర్యం... ప్రతి డివిజన్‌లో మొబైల్ దవాఖానల ఏర్పాటు, ఉచితంగా మందుల పంపిణీ... ప్రతీ ఇంటికి సెట్ టాప్ బాక్స్ ఉచితంగా అందజేత... కేంద్ర సాయంతో 600 మెగావాట్ల విద్యుత్ కేంద్రం నిర్మాణం.. తదితర హామీలు టీడీపీ-బీజేపీ ఎన్నికల మ్యానిఫెస్టోలో ఉన్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : TDP  BJP  GHMC  GHMC Elections  Free Wifi  Free setup box  

Other Articles