Take LPG gas connection in instalment

Take lpg gas connection in instalment

Gas, Cylinder, LPG, Online payment, Petrolium Gas

Consumers can now make online payment for the cooking gas or LPG cylinders at the time of booking. This facility was launched on Sunday by Petroleum Minister Dharmendra Pradhan. "Launched 'Online payment facility' for LPG refill to bring consumer convenience, transparency & cashless transaction," Pradhan tweeted.

వాయిదా పద్దతిలో గ్యాస్ కనెక్షన్ తీసుకోవచ్చు..!

Posted: 01/25/2016 09:42 AM IST
Take lpg gas connection in instalment

అదేదో తెలుగు పాటలో చెప్పినట్లు.. వాయిదా పద్దతుంది దేనికైనా అన్నట్లు మన భారత ప్రభుత్వం గ్యాస్ కనెక్షన్ తీసుకునే వారికి ఓ బంపరాఫర్ చేస్తుంది. మామూలుగా అయితే గ్యాస్ కనెక్షన్ తీసుకోవాలనుకుంటే అప్పటి్కప్పుడు దాని డబ్బులు కట్టి తీసుకోవాలి.. కానీ ఇక మీదట డబ్బులు లేకున్నా దాన్ని వాయిదా పద్దతిలో అంటే ఇన్ స్టాల్ మెంట్ లో కట్టుకుంటూ పోవచ్చు. ప్రస్తుతం కొత్త కనెక్షన్ 3400 రూపాయలకు వస్తుండగా.. దానిని 24 నెలల పాటు వాయిదా పద్దితో కట్టుకునేలా భారత పెట్రోలియం శాఖ ప్లాన్ చేస్తోంది.

అలాగే సిలిండర్ రీఫిలింగ్ కోసం బుక్ చేసుకున్నప్పుడే డబ్బులు కూడా చెల్లించేలా ఆన్‌లైన్ సదుపాయం అందుబాటులోకి వచ్చింది. గతంలో ఆన్‌లైన్లో బుక్ చేసుకునే సదుపాయం మాత్రమే ఉండేది. డబ్బులు మాత్రం సిలిండర్‌ను తెచ్చిన డెలివరీ బోయ్స్‌కు ఇవ్వాల్సి వచ్చేది. ఇకపై సిలిండర్‌ను బుక్ చేసుకున్న సమయంలోనే, ఆన్‌లైన్లో రీఫిలింగ్ డబ్బులనూ చెల్లించవచ్చు. ఎల్పీజీ సిలిండర్ రీఫిలింగ్ కోసం చెల్లించే మొత్తాన్ని ఆన్‌లైన్‌లో చెల్లించే సౌకర్యాన్ని ఆదివారం కేంద్ర పెట్రోలియం, సహజవాయువు శాఖ సహాయ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ముంబైలో ప్రారంభించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Gas  Cylinder  LPG  Online payment  Petrolium Gas  

Other Articles