Student unions called to Chalo HCU

Student unions called to chalo hcu

Rohith, Rohith Suicide, HCU, Hyderabad central University. Chalo HCU, Osmania University

On HCU Student Rohith suicide incident, Student unions called to Chalo HCU from Osmania University to Hyderabad central University.

చలో హెచ్.సి.యతో హైదరాబాద్ లో టెన్షన్.. టెన్షన్

Posted: 01/25/2016 08:42 AM IST
Student unions called to chalo hcu

హైదరాబాద్ యూనివర్సిటీలో రోహిత్ అనే విద్యార్థి మృతి మీద విద్యార్థులు ఆగ్రహంతో ఊగిపోతున్నారు. రోహిత్ చావుకు కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తు విద్యార్థి సంఘాలు చలో హెచ్.సీ.యుకు పిలుపునిచ్చారు. ఉస్మానియా యూనివర్సిటీ నుండి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వరకు భారీ ర్యాలీకి విద్యార్థి సంఘాలు ప్లాన్ వేశాయి. దీంతో పోలీసులు అలర్ట్ అవుతున్నారు. అవాంఛనీయ ఘటనలు జరిగే అవకాశం ఉందన్న హెచ్చరికలతో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. విద్యార్థులను ఎట్టి పరిస్థితుల్లోనూ అడ్డుకోవాలని భావిస్తున్నారు. తమను అడ్డుకోవాలని చూస్తే జరగబోయే పరిణామాలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, పోలీసులదే బాధ్యతని విద్యార్థులు హెచ్చరించారు.

రోహిత్ మృతికి కారణమైన కేంద్రమంత్రులను వెంటనే తొలగించాలని.. అలాగే వీసీ అప్పారావుని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ.. ఓయూ ఆర్ట్స్ కాలేజ్ ప్రాంగణంలో విద్యార్థులు ఆందోళనకు దిగారు. వి సపోర్ట్ అఫ్జల్ గురు.. వి సపోర్ట్ యూకుబ్ మెమన్.. వి స్టాండ్ విత్ రోహిత్ వేముల అంటూ రాసిన ప్లకార్డులను ప్రదర్శించారు. హెచ్ సీయూతో పాటు ఓయూ, నిజాం కాలేజ్ వద్ద పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆర్ట్స్ కాలేజ్ నుంచి విద్యార్ధులు ర్యాలీగా బయలు దేరగానే ఎన్సీసీ గేట్ వద్ద వారిని అడ్డుకోవాలని పోలీసులు భావిస్తున్నారు. నిజాం కాలేజీ విద్యార్థులు బషీర్ బాగ్ చౌరస్తా దాటొద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Rohith  Rohith Suicide  HCU  Hyderabad central University. Chalo HCU  Osmania University  

Other Articles