అగ్రరాజ్యం అమెరికాను మంచు తుపాను గడగడ వణికిస్తోంది. దేశ రాజధాని వాషింగ్టన్ లో ఒక్క రోజే 30 అంగుళాల మేర మంచు కురిసింది. అమెరికాలోని మొత్తం 10 రాష్ట్రాలు స్టేట్ ఎమర్జెన్సీని ప్రకటించాయి. మంచు తుపాను దెబ్బకు ఇప్పటి వరకు 9 మంది మృతి చెందారని అధికారులు తెలిపారు. పది లక్షల మంది మంచులో ఇరుక్కున్నట్లు వారు ప్రకటించారు. జార్జియా, ఉత్తర కరోలినా, టెన్నెస్సీ, మేరీలాండ్, వర్జీనియా, పెన్సిల్వేనియా, న్యూజెర్సీ, న్యూయార్క్, కెంటకీ రాష్ట్రాలు మంచు తుపానుకు విలవిల్లాడిపోతున్నాయి. ఒక్క వర్జీనియాలోనే దాదాపు 800 ట్రాఫిక్ ప్రమాదాలు సంభవించినట్లు అధికారులు తెలిపారు. వర్జీనియాలోని గురుద్వారాలు, ఆలయాల్లో మంచులో చిక్కుకుపోయిన వారికి పునరావాసం కల్పిస్తున్నారు. ఈ తుపాను వల్ల దాదాపు లక్షా ఇరవై వేల ఇళ్లల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దాదాపు వంద బిలియన్ డాలర్ల మేర ఆస్తి నష్టం జరిగినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. మరో వారం రోజుల పాటు ఈ పరిస్థితిలో మార్పు రాదని అమెరికా వాతావరణ శాఖ హెచ్చరించింది.
మంచు తుపాను కారణంగా అమెరికా వణికిపోతోంది. దేశ తూర్పు ప్రాంతాన్ని దుప్పటిలా మంచుతో కప్పేసింది. పలు రాష్ర్టాల్లో మంచు తుపాను 19 మందిని బలితీసుకుంది. మంచు కారణంగా అర్కాన్సాస్, నార్త్ కరోలినా, కెంటకి, ఓహియో, టెన్నెస్సి, వర్జీనియా రాష్ర్టాల్లో జరిగిన కారు ప్రమాదాల్లో 13 మంది మృతిచెందారు. మేరీల్యాండ్‌లో ఒకరు, న్యూయార్కులో ముగ్గురు మంచు కారణంగా మరణించారు. వర్జీనియాలో హైపోథెర్మియా కారణంగా ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more