Amit Shah elected BJP president for full term

Amit shah elected bjp president for full term

Amith Shah, BJP, Modi, BJP President, Amith Shah as BJP President

Amit Shah, a confidant of Prime Minister Narendra Modi, was on Sunday elected the BJP president for a full three-year term, retaining the post he has held since the party took power in India in 2014. Shah, 51, who took charge of the party from now Home Minister Rajnath Singh, was elected unopposed at an event at the BJP headquarters attended by virtually all party leaders.

మరోసారి బిజెపి సారధిగా అమిత్ షా

Posted: 01/24/2016 05:06 PM IST
Amit shah elected bjp president for full term

బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా అమిత్ షా మరోసారి ఎన్నికయ్యారు. బీజేపీ జాతీయ అధ్యక్ష పదవికి అమిత్ షా నామినేషన్ దాఖలు చేయగా, ప్రధాని నరేంద్ర మోదీ, పలువురు కేంద్ర మంత్రులు, బీజేపీ పాలిత ముఖ్యమంత్రులు.. ఆయన పేరును ప్రతిపాదించారు. పార్టీ అధ్యక్షుడిగా అమిత్ షాను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అమిత్ షాకు మళ్లీ పట్టాభిషేకం జరుగుతున్న ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు ఎల్ కె అద్వానీ, మురళీ మనోహర్ జోషి గైర్హాజర్ చర్చనీయాంశమైంది. బీజేపీ అధ్యక్షుడిగా అమిత్ షా పూర్తికాలం పదవిలో కొనసాగనున్నారు. అంటే 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఆయన సారధ్యంలోనే బీజేపీ పోటీకి సిద్ధమవుతుందన్నమాట. అంతేకాదు ఈ ఏడాది అసోం, పశ్చిమ బెంగాల్ , తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు, 2017 లో ఉత్తరప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికలకు భారతీయ జనతా పార్టీకి అమిత్ షానే సారధ్యం వహిస్తారు.

గతంలో పార్టీకి అధ్యక్షుడుగా ఉన్న రాజ్‌నాథ్ సింగ్ కేంద్రప్రభుత్వంలో హోం మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టడంతో ప్రధాని మోదీకి ఆంతరంగికుడైన అమిత్ షా బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు.జనవరి 23న ఆయన పదవీ కాలం పూర్తి కావడంతో ప్రెసిడెంట్ ఎన్నిక అనివార్యమైంది. ప్రధాని నరేంద్రమోదీ ఆశీస్సులు పుష్కలంగా ఉన్న అమిత్ షా తిరిగి అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అమిత్ షా ఎన్నిక పూర్తి కావడంతో యువకులతో కొత్త కార్యవర్గాన్ని రేపో, మాపో ప్రకటిస్తారు. అమిత్ షా టీమ్ రెడీ అయితే ప్రధాని నరేంద్రమోదీ కూడా కేంద్ర కేబినెట్ లో మార్పులు చేర్పులకు సిద్ధమవుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Amith Shah  BJP  Modi  BJP President  Amith Shah as BJP President  

Other Articles