Meet the Bride who entered marriage hall on a bullet

Meet the bride who entered marriage hall on a bullet

Bullet, Bike, Bride, marriage, bride on Bullet

Meet the Bride who entered marriage hall on a bullet! Ayesha belongs to Ahmedabad and is a professor of computer science. She loves bullet and hence entered the marriage hall on a bullet instead of a doli.. On the other hand Ayesha’s husband does not know how to ride a bike.

బుల్లెట్ మీద వచ్చిన పెళ్లి కూతురు

Posted: 01/24/2016 06:13 PM IST
Meet the bride who entered marriage hall on a bullet

ఇంకొంత సేపట్లో తాళి కట్టించుకునే అమ్మాయి ఎలా ఉంటుంది...? అందంగా, సిగ్గుపడుతూ, వయ్యారాలు ఒళకబోస్తుంది. కానీ ట్రెండ్ మారింది... అమ్మాయిలు అన్నింటిలో ఫాస్టుగా ఉన్నారు. అబ్బాయిలతో ఎందులోనూ తీసిపోవడం లేదు. చేతిలో కొబ్బరిబోండాం, బుగ్గపై సిగ్గుతో మెల్లిగా అడుగులేస్తూనే కదా.. కానీ ఆ వధువు మాత్రం దడ్ దడ్ దడ్ అని సౌండ్ చేసుకుంటూ వచ్చింది. గుజరాత్ అహ్మదాబాద్ కు చెందిన ఈ పెళ్లికూతురు పేరు ఆయేషా. వృత్తిరీత్యా ప్రొఫెసర్ అయిన ఆయేషాకు బుల్లెట్ అంటే ప్రాణం. దాంతో తన పెళ్లికి బుల్లెట్ మీద వచ్చి వార్తల్లో నిలిచింది. అమ్మడు అసలు కథేంటో మీరే చదవండి.


గుజరాత్ లోని అహ్మదాబాద్ కు చెందిన అయేషా ప్రొఫెసర్ గా పనిచేస్తోంది. అయితే తనకు బుల్లెట్ అంటే ప్రాణం. తన సిస్టర్ గురించి తెలిసిన అయేషా బ్రదర్ ఆమెకు బుల్లెన్ ను పెళ్లికి గిఫ్ట్ గా ఇచ్చాడు. దాంతో ఎగిరిగంతేసిన ఈ పెళ్లికూతురు అదే బుల్లెట్ ని స్వయంగా నడుపుకుంటూ మండపానికి చేరుకుంది. ఏంటా సౌండ్ అంటారా బుల్లెట్ బండి. బైక్ లంటే ఇష్టపడే యువతి పెళ్లి మండపం వరకు బుల్లెట్ నడుపుకుంటూ వచ్చింది. పెళ్లికూతురు ఇంకా రావట్లేదని ఎదురుచూస్తున్న వాళ్లంతా ఒక్కసారిగా ఈ దృశ్యం చూసి అవాక్కయ్యారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Bullet  Bike  Bride  marriage  bride on Bullet  

Other Articles