Dont want your Rs 8 lakh or Rs 8 crore

Dont want your rs 8 lakh or rs 8 crore

rohith, HCU, Hyderabad Central University, Rohith Suicide

When a girl named Nirbhaya was brutally raped and killed, did anyone question her caste? Then why is Rohith’s caste under question here?” Radhika Vemula asked this on Saturday amid claims that her son Rohith, whose suicide is being seen as the fallout of caste discrimination, was not a Dalit.

8 కోట్లిచ్చినా వద్దంటున్న రోహిత్ తల్లి

Posted: 01/24/2016 01:11 PM IST
Dont want your rs 8 lakh or rs 8 crore

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో రోహిత్ ఆత్మహత్య వివాదం అంతకంతకు ముదురుతోంది. అయితే నిన్నటి దాకా రోహిత్ ఆత్మహత్య మీద మీడియా ఫోకస్ చెయ్యగా. అసలు రోహిత్ దళితుడే కాదు అంటూ రకరకాల వార్తలు వచ్చాయి. దాని మీద రోహిత్ తల్లి రాధిక స్పందించారు. తన కులం గురించి, తన కొడుకు ఆత్మహత్యకు హెచ్.సీ.యు ప్రకటించిన ఎక్స్ గ్రేషియా మీద కూడా ఆమె మాట్లాడారు. తనకు హెచ్‌సీయూ ప్రకటించిన 8 లక్షల పరిహారం అక్కర్లేదని.. 8 కోట్లు ఇచ్చినా తీసుకోనని. తన కొడుకు ఆత్మహత్య కారకులకు శిక్ష పడితే చాలు అని ఆమె అన్నారు.

తమకు న్యాయం జరిగితేనే రోహిత్ అస్థికలను తీసుకువెళ్తామన్నారు. ఇన్నాళ్లుగా లేనిది తన కులంపై ఎందుకు రాద్ధాంతం చేస్తున్నారని ఆమె ప్రశ్నించారు. 1985లో వడ్డెర కులానికి చెందిన వ్యక్తితో నా వివాహం జరిగింది. ముగ్గురు పిల్లలు పుట్టాక కుటుంబకలహాలతో విడాకులు తీసుకున్నాం. నేను మాల కులస్థురాలిని. మాల ఆచారాల ప్రకారమే నా పిల్లలను పెంచాను. ఢిల్లీలో నిర్భయను చంపినప్పుడు ఎవ్వరూ ఆమె కులం గురించి అడగలేదు. ఇప్పుడెందుకు రోహిత్ కులంపై వివాదం చేస్తున్నారు అని ఆమె ప్రశ్నించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : rohith  HCU  Hyderabad Central University  Rohith Suicide  

Other Articles