Young ISIS attackers may target PM Modi on Republic Day

Young isis attackers may target pm modi on republic day

Modi, Security, Narendra Modi, ISIS, Terrorists, Republic Day

Security agencies are more cautious about Republic Day arrangements since they received an intelligence report that said that terrorist groups such PoK, Af-Pak and even Islamic State could be preparing teens to carry out a fidayeen attack on PM Modi, says an English daily. PM Narendra Modi had last year broken the security detail by breaking the cordon to meet children while going out of Red Fort.

మోదీని చంపడానికి చిన్న పిల్లలు..!

Posted: 01/24/2016 12:58 PM IST
Young isis attackers may target pm modi on republic day

ధేశవ్యాప్తంగా ఉగ్రవాదులు దాడి చెయ్యడానికి సిద్దంగా ఉన్నారు అని తేటతెల్లమైంది. హైదరాబాద్, బెంగళూరుతో పాటు పలు ప్రాంతాల్లో ఉగ్రవాదులను ఎన్ఐఏ అధికారులు అరెస్టు చేశారు. ప్యారిస్ తరహా దాడికి ఉగ్రవాదులు సిద్దమైనట్లు పక్కా సమాచారంతో దేశంలో హైఅలర్ట్ ప్రకటించారు. అయితే తాజాగా మరో కొత్త విషయం బయటకు వచ్చింది. అదేంటంటే.. ప్రధాని నరేంద్ర మోదీని చంపడానికి ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు 12 నుంచి 15 సంవత్సరాల వయస్సున్న ముగ్గురు పిల్లలకు ఉగ్రవాదులు శిక్షణ ఇచ్చినట్లు తెలుస్తుంది.

ఆయుధాలు, బాంబులు వాడటంలో శిక్షణ ఇచ్చిన ఉగ్రవాదులు.. తమకు తాము ఆత్మాహుతి దాడి ఎలా చేయాలో కఠోర శిక్షణ ఇచ్చినట్లు సమాచారం. అయితే గతేడాది స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా మోడీ పిల్లలతో సరదాగా గడిపిన విషయం విదితమే. ఈ వేడుకల్లో కూడా పిల్లలతో గడిపే అవకాశం ఉందని ఉగ్రవాదులు ఈ కుట్రకు తెర లేపినట్లు నిఘా వర్గాలు తెలిపాయి. ఈ క్రమంలో మోడీకి భద్రత కట్టుదిట్టం చేశారు. మోడీ భద్రతను ఎస్పీజీ కమెండోలు పర్యవేక్షిస్తున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Modi  Security  Narendra Modi  ISIS  Terrorists  Republic Day  

Other Articles