Must Learn English Or Leave UK

Must learn english or leave uk

English, David Cameron, David Cameron on English, David Cameron about English language

The Prime Minister has launched a £20m initiative aimed at helping female members of the Muslim community with their language skills in an attempt to integrate them into the community and help tackle extremism. However, he has been accused of taking a "clumsy and simplistic" approach to the issue and of "dog-whistle" politics.

ఇంగ్లాండ్ లో ఉండాలంటే ఇంగ్లీష్ రావాల్సిందే

Posted: 01/19/2016 01:18 PM IST
Must learn english or leave uk

ఇంగ్లీష్ రాకుంటే ఇక మీదట దేశంలో ఉండేందుకు వీలులేకుండా బ్రిటన్ నిర్ణయం తీసుకుంది. నిజానికి దేశంలోకి పెరుగుతున్న వలసలను నిరోధించేందుకు బ్రిటన్ కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నది. ఇందులో భాగంగా బ్రిటన్‌లో నివాసముంటున్న మహిళలందరూ తప్పనిసరిగా ఇంగ్లిష్ భాషపై నైపుణ్యం పెంచుకోవాలని ఆదేశించనున్నది. ఈ మేరకు ఓ పరీక్షను నిర్వహిస్తున్నది.. అందులో ఉత్తీర్ణులు అయిన వారినే దేశంలో నివసించే అవకాశం కల్పించనున్నది. లేదంటే వారి స్వదేశాలకు పంపేయాలని నిర్ణయించింది. ఈ నిర్ణయం కఠినమే అయినా తమ దేశంలో నివసించాలంటే కొన్ని బాధ్యతలు కూడా పంచుకోవాల్సి ఉంటుందని స్వయంగా బ్రిటన్ ప్రధాని డేవిడ్ కామరూన్ వెల్లడించారు.

సోమవారం ఆయన బీబీసీ రేడియోకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఓ మహిళ తన భర్తతో బ్రిటన్‌కు రాగా, వారికి ఇక్కడే పిల్లలు పుట్టిన సందర్భంలోనూ కొత్త చట్టం ప్రకారం వారిని వెనక్కి పంపిస్తారా? అని ప్రశ్నించగా.. ఈ విషయంలో ఎలాంటి హామీలు ఇవ్వలేము. కొత్త చట్టం ప్రకారం ఇంగ్లిష్ భాషా నైపుణ్యం పెంచుకొనేందుకు రెండున్నరేండ్లు గడువు ఇస్తాం. ఆ తర్వాత కూడా ఇంగ్లిష్ పరీక్షలో ఉత్తీర్ణులు కాలేకపోతే వారిని స్వదేశాలకు పంపిస్తాం. బ్రిటన్ పౌరసత్వం ఉన్న పిల్లలు తండ్రులతో దేశంలో ఉండొచ్చు.. కానీ, తల్లులకు అనుమతినివ్వలేం అని స్పష్టం చేశారు. కాగా ఈ నిర్ణయం వల్ల ముస్లిం మహిళలే ఎక్కువ ఇబ్బందుల పడవచ్చని అధికారులు చెబుతున్నారు. దేశంలో 1.90 లక్షల మంది ముస్లిం మహిళలకు ఇంగ్లిష్‌ పరిజ్ఞానం లేదని పేర్కొన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles