MLAs husband excape from police station

Mlas husband excape from police station

Bihar, MLAs Husband, Escape from Police station

Bihar MLA from the ruling JD(U) allegedly helped her husband escape from police custody in Purnia district. Bima Bharti, JD(U)'s Rupauli MLA, along with JD(U) Purnia MP Santosh Kushwaha helped her husband Awadhesh Mandal escape from the police station within hours of his arrest on Sunday. Bharti is a former minister.

పోలీస్ స్టేషన్ నుండి ఎమ్మెల్యే భర్త పరార్

Posted: 01/19/2016 01:16 PM IST
Mlas husband excape from police station

బీహార్ అంటేనే చాలా మందికి రౌడీలు, గుండాల రాజ్యంగా తెలుసు. అక్కడి నాయకులు రౌడీలను కలిగి ఉండటమో లేదంటే రౌడీలే నాయకులుగా ఎదగడమో జరుగుతుంది. అయితే తాజాగా బీహార్ లో చోటుచేసుకున్న ఓ ఘటన వార్తల్లో నిలుస్తోంది. పోలీస్ స్టేషన్ నుండి ఎమ్మెల్యే భర్త పారిపోవడం. అవును ఎమ్మెల్యేగా, ప్రజాప్రతినిధిగా ఉన్న ఆవిడ భర్త పోలీస్ స్టేషన్ నుండి పారిపోవడం సంచలనం రేపింది. అయితే అయ్యాగారి మీద ఎన్ని కేసులున్నాయో తెలిస్తే మీరు షాకవుతారు. ఒకటి కాదు రెండు కాదు దాదాపు 100 క్రిమినల్ కేసులున్నాయట. జేడీయూ ఎమ్మెల్యే, మాజీ మంత్రి భీమా భారతిగారి భర్త చేసిన పని ప్రస్తుతం బీహార్ లోనే కాకుండా దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. అయితే అయ్యాగారు పారిపోయిన విధానం చూస్తే... సినిమా స్టోరీలాగా అనిపిస్తుంది.

జేడీయూ ఎమ్మెల్యే, మాజీ మంత్రి భీమా భారతిగారి భర్త అవదేష్‌ ఓ హత్య కేసులో సాక్షిని బెదిరించినందుకు పూర్ణియా జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. 2005లో జరిగిన ఓ హత్య కేసులో అవదేష్ నిందితుడిగా ఉన్నాడు. అవదేష్ను అరెస్ట్ చేసిన కొన్ని గంటలకు ఆయన భార్య బీమా భారతి, ఎంపీ సంతోష్ 150 మందికి పైగా అనుచరులతో మరంగ పోలీస్ స్టేషన్కు వచ్చారు. ఎంపీ పోలీసులతో మాట్లాడుతుండగా, బీమా భారతి పోలీస్ స్టేషన్ ఎదుట తన వాహనంలో కూర్చున్నారు. ఈ సమయంలో అవదేష్ ఒక్కసారిగా ఎమ్మెల్యే వాహనంలోకి ఎక్కి పారిపోయాడు. కాసేపటి తర్వాత ఎంపీ కూడా అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఇదేదో యాక్షన్ సినిమాలో సీన్ లాగా కనిపించినా కానీ నిజం. బీహార్ లో రౌడీరాజ్యం నడుస్తోంది అని చెప్పడానికి ఇంతకంటే మంచి ఉదాహరణ అవసరంలేదేమో.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Bihar  MLAs Husband  Escape from Police station  

Other Articles