Boy, girl tied to a tree after relatives spot them together

Boy girl tied to a tree after relatives spot them together

Boy, Rajasthan, Lovers,

A boy and a girl were tied to a tree after the girl's relatives spotted them together in Banswara district of Rajasthan, police said The incident occurred in Umbada village under Loharia police station area. The boy, aged 20 years, and the girl were caught moving around by the relatives of the girl following which they took the duo to the village and allegedly tied them to a tree for nearly two hours, police said.

ITEMVIDEOS: ప్రేమికులను చెట్టుకు కట్టేసి..

Posted: 01/17/2016 05:06 PM IST
Boy girl tied to a tree after relatives spot them together

చట్టాన్ని చేతిలోకి తీసుకోవడం తప్పు అని తెలిసినా కూడా కొంత మంది మాత్రం అదే తప్పు మళ్లీమళ్లీ చేస్తుంటారు. తప్పు చేసిన వారిని శిక్షించడానికి చట్టాలున్నా కానీ వాటిని ఖాతరుచెయ్యకుండా తమకు నచ్చినట్లు చాలా మంది చేస్తుంటారు. ఇలాంటి ఘటనే ఒకటి రాజస్థాన్ లో చోటుచేసుకుంది. అయితే ఇందులో ఇద్దరు ప్రేమికులను చెట్టుకు కట్టివెయ్యడం... ఆ దృష్యాలు కాస్తా సోషల్ మీడియాలో హల్ చల్ చెయ్యడంతో వివాదం ముదిరి పాకానపడింది. దాంతో సోలీసులు మొత్తం ఘటన మీద కేసు నమోదు చేశారు. లవర్స్ ను అలా కట్టేయడానికి కారణం ఏంటో తెలుసా..? అయితే తెలుసుకోండి.

బన్స్‌వారా జిల్లా లోహోరియా పోలీస్ స్టేషన్ పరిధిలోని ఉంబాడా గ్రామంలో దారుణం జరిగింది. ఓ ప్రేమ జంటను ఉంబాడా గ్రామస్థులు ఓ గుంజకు కట్టేసి రెండు గంటల పాటు హింసించారు. ఓ యువకుడు తన ప్రియురాలితో కలిసి తిరుగుతుండటాన్ని యువతి బంధువులు గమనించారు. దీంతో వారిద్దరిని ఓ ఇంటి ముందున్న గుంజకు కట్టేశారు. రెండు గంటల పాటు ఆ ప్రేమికులను హింసించారు. విషయం తెలుసుకున్న యువకుడి తల్లిదండ్రులు అక్కడికి వచ్చి అతడిని విడిపించుకుని పోయారు. రెండు గంటలపాటు కట్టేయడంపై బాధిత యువకుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Boy  Rajasthan  Lovers  

Other Articles