YSR Congress MP Mithun Reddy arrested for assaulting Air India official

Ysr congress mp mithun reddy arrested for assaulting air india official

mithun Reddy, YSRCP MP, Mithun Reddy Arrest, Airport

YSR Congress Party MP from Rajampet P V Mithun Reddy was arrested at Chennai airport late Saturday night for assaulting an Air India official last November at Renigunta Airport in Chitoor District in Andhra Pradesh. Chittoor Police had registered a case against the MP after he and members of his family manhandled, slapped and assaulted the Air India station manager K Rajasekhar on November 27 after AI staff refused them boarding passes as the boarding for the New Delhi flight they were supposed to catch has already closed.

ఎంపీ మిథున్ రెడ్డి అరెస్టు.. చిత్తూరులో ఉద్రిక్తత

Posted: 01/17/2016 04:20 PM IST
Ysr congress mp mithun reddy arrested for assaulting air india official

వైసిపి పార్టీ ఎంపీ మిథున్ రెడ్డి కొద్ది రోజుల క్రితం తిరుపతిలోని రేణిగుంట విమానాశ్రయ మేనేజర్ పైన చేయి చేసుకున్న విషయం తెలిసిందే. ఈ కేసులో శనివారం రాత్రి పోలీసులు మిథున్ రెడ్డిని అరెస్టు చేశారు. అనంతరం అతనికి సెషన్స్ కోర్టు న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్‌ను విధించారు. గట్టి బందోబస్తు మధ్య ఆదివారం ఉదయం చెన్నై నుంచి శ్రీకాళహస్తికి మిథున్ రెడ్డిని తీసుకువచ్చి పోలీసులు ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించారు. మిథున్ రెడ్డి అరెస్టును నిరసిస్తూ చిత్తూరు జిల్లాలో నిరసనలు వ్యక్తమయ్యాయి. మిథున్ అరెస్టు అన్యాయమని ఆందోళన నిర్వహించారు. టిడిపి కక్షపూరిత రాజకీయాలు వదిలిపెట్టాలని మండిపడ్డారు. దీంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. తాము చట్టాన్ని గౌరవిస్తామని తిరుపతి ఎంపీ వరప్రసాద్ అన్నారు. వైసిపిని అణగదొక్కేందుకే మిథున్ రెడ్డిని అరెస్టు చేశారన్నారు.

ఎయిరిండియా మేనేజరుపై దాడి చేసిన కేసులో తాము మిథున్ రెడ్డికి లుకౌట్ నోటీసులను జారీ చేశామని పోలీసులు తెలిపారు. వాటి కారణంగా చెన్నై విమానాశ్రయంలో కనిపించిన మిథున్ రెడ్డిని, అక్కడి భద్రతా దళాలు అదుపులోకి తీసుకున్నాయని, ఆపై తిరుపతి పోలీసులకు అప్పగించారన్నారు. మిథున్ రెడ్డితో పాటు మధుసూదన్ రెడ్డి సైతం విమానాశ్రయంలో పట్టుబడ్డారని, వీరిద్దరినీ కేసు నమోదైన శ్రీకాళహస్తికి తీసుకువచ్చి, మేజిస్ట్రేట్ ముందు హాజరు పరిచామని చెప్పారు. చిత్తూరు జిల్లా వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను ముందస్తుగా అరెస్ట్ చేశారు. అంతే కాకుండా ఆరుగురు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : mithun Reddy  YSRCP MP  Mithun Reddy Arrest  Airport  

Other Articles