Ink Attack On Chief Minister Arvind Kejriwal

Ink attack on chief minister arvind kejriwal

Kejriwal, Arvind Kejriwal, Ink attack on Kejriwal

Chief Minister Arvind Kejriwal had ink thrown at him while he was addressing a gathering on the success of odd-even scheme at the Chhatrasal stadium in Delhi. A woman in her 20s walked towards the dais and threw ink, and some papers and a CD at Mr Kejriwal. She was immediately detained by the police. The chief minister was addressing a gathering of nearly 5,000 people to thank Delhi residents for what the government says was a successful odd-even car rationing trial.

కేజ్రీవాల్ పై ఇంక్ దాడికి యత్నం..!

Posted: 01/17/2016 07:26 PM IST
Ink attack on chief minister arvind kejriwal

దిల్లీ ముఖ్యమంత్రికి మరోసారి పరాభవం ఎదురైంది. గతంలో అహ్మదాబాద్ లో బిజెపి కార్యకర్తల చేతిలో దాడికి గురై, ఇంకు మొహం మీద పడింది. మరోసారి దిల్లీలో అదే ఛేదు అనుభవం ఎదురైంది. ఆయన ఢిల్లీ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపేందుకు నిర్వహిస్తున్న సమావేశంలో ఓ మహిళ ఆయనపై ఇంక్ చల్లే ప్రయత్నం చేసింది. కేజ్రీవాల్ నిల్చున్న వేదిక ఎత్తుగా ఉండడంతో ఆయన పై ఇంక్ పడలేదు. కానీ, సెక్యూరిటీ సీబ్బంది, పోలీసులు ఒక్కసారిగా ఆమెను చుట్టుముట్టి ఇంక్ బాటిల్ గుంజుకున్నారు. పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు.

మహిళ వేదిక వద్దకు వచ్చి ఇంక్, కొన్నికాగితాలు, ఓ సీడీ కూడా కేజ్రీవాల్ వైపు విసిరే ప్రయత్నం చేసింది. ఢిల్లీలో 15 రోజులపాటు నిర్వహించిన ‘సరి- బేసి’ కార్ల పథకం విజయవంతంగా పూర్తయిన నేపథ్యంలో ఢిల్లీ ప్రజలకు కృతజ్ఞతలు చెప్పేందుకు ఢిల్లీ ఛత్రసాల్ స్టేడియంలో సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. దాదాపు ఐదు వేలమంది ఢిల్లీ వాసులు ఆ సమావేశానికి హాజరయ్యారు. ఈ సమావేశంలో మహిళ సీఎంపై ఇంక్ జల్లే ప్రయత్నం చేసింది. ఆమె ఆగ్రహానికి కారణాలేమిటో తెలుసుకునే అవకాశాన్ని పోలీసులు మీడియాకు ఇవ్వకపోవడం విశేషం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Kejriwal  Arvind Kejriwal  Ink attack on Kejriwal  

Other Articles