India should not overreact to Pathankot attack

India should not overreact to pathankot attack

India, pakistan, Pathankot, pakistan attack, Pervez Musharraf, Pervez Musharraf on India, Pervez Musharraf about Pathankot attack

Former Pakistan President General (retired) Pervez Musharraf has called on India to not 'overreact' to the terror strike on the Pathankot IAF base, saying that both nations were victims of extremism and also accused New Delhi of creating pressure on Islamabad over terrorism.

పఠాన్ కోట్ దాడిపై భారత్ అతిగా స్పందిస్తోందట!

Posted: 01/12/2016 03:29 PM IST
India should not overreact to pathankot attack

పఠాన్ కోట్ దాడితో అంతర్జాతీయ సమాజం పాకిస్థాన్ వైఖరిని తప్పుపడుతున్నాయి. పాకిస్థాన్ లో శిక్షణ తీసుకున్న ఉగ్రవాదులు ప్లాన్ చేసుకోని మరీ పఠాన్ కోట్ మీద దాడికి పాల్పడినట్లు క్లీయర్ గా తెలుస్తోంది. అయితే భారత్ దీని మీద గుర్రుగా ఉంది... అందుకే పాకిస్థాన్ తో చర్చలను రద్దు చేసుకుంది. అయితే పఠాన్ కోట్ దాడి మీద భారత్ స్పందన మీద ఒకాయన మాత్రం భారత్ అతిగా స్పందిస్తోందని అంటున్నారు. పైగా భారత్, పాకిస్థాన్ రెండూ కూడా ఒకే గాడికి చెందినవి అంటున్నారు. ఇంతకీ ఆయన ఎవరు అనుకుంటున్నారా..? పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్. అయ్యాగారు ఇంకా ఏమన్నారో చూడండి.

భారత్, పాక్‌ దేశాలు రెండూ ఉగ్రవాద బాధిత దేశాలేనని పేర్కొన్న ఆయన ఉగ్రవాదం విషయంలో ఇస్లామాబాద్‌పై ఢిల్లీ ఒత్తిడి తీసుకొస్తోందని ఆరోపించారు. పాకిస్థాన్‌లోని ఓ న్యూస్‌ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన పై విధంగా వ్యాఖ్యానించారు. భారత్, పాక్‌ దేశాల్లో ఉగ్రవాదం వేళ్లూనుకుని ఉన్నప్పుడు పఠాన్‌కోట్‌ లాంటి ఘటనలు జరగడం సాధారణమేనని తేలిగ్గా కొట్టిపడేశారు. అంతమాత్రానికే భారత్ ఈ ఘటనపై తీవ్రంగా స్పందించడం సరికాదని నిందించారు. భారత్లో ఎక్కడ ఉగ్రదాడి జరిగినా అది పాకిస్థాన్‌ వైపే చూస్తోందని, భారత్ ఏమైనా తీవ్రవాద, ఉగ్రవాద రహిత దేశమా అని అక్కసు వెళ్లగక్కారు. అయితే ఈ విషయంలో పాకిస్థాన్‌పై భారత్ ఒత్తిడి తీసుకురాలేదని పేర్కొన్నారు. తమది చాలా చిన్న దేశమని, దానిని గౌరవించాల్సిన అవసరం ఉందని అన్నారు.

భారత్ లో తీవ్రవాద ప్రాంతాలు చాలా ఉన్నాయని పేర్కొన్నారు. తీవ్రవాదం ఎప్పుడూ అక్కడ సమస్యేనని అన్నారు. మోదీ ప్రధాని అయ్యాక భారత్లోని ముస్లింలు చాలా అభద్రతతో ఉన్నారని ముషారఫ్‌ చెప్పారు. తాను అధ్యక్షుడిగా ఉన్న సమయంలో అప్పటి భారత ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయితో సత్సంబంధాలు ఉండేవని గుర్తుచేసుకున్నారు. వాజ్‌పేయి తర్వాత మన్మోహన్‌ సింగ్‌తోనూ మంచి సంబంధాలు ఉండేవని, అయితే మోదీ వచ్చాక దురదృష్టవశాత్తు అది జరగడం లేదని అన్నారు. ఢిల్లీ, బిహార్‌ ఎన్నికల్లో బీజేపీ ఓటమి పాలయ్యాక మోదీ ప్రభ తగ్గిపోయిందని ముషారఫ్‌ వ్యాఖ్యానించారు. సమస్యల పరిష్కారానికి వాజ్‌పేయి, మన్మోహన్‌సింగ్‌లు చాలా నిజాయితీగా వ్యవహరించేవారిని గుర్తుచేసుకున్నారు. ఇటీవల మోదీ పాకిస్థాన్‌ ఆకస్మిక పర్యటనపై ముషారఫ్‌ స్పందిస్తూ.. అదంతా ‘షోమ్యాన్‌షిప్‌’ అని కొట్టిపడేశారు. ఆఫ్గనిస్థాన్‌లో మోదీ బయలుదేరేముందు పాక్‌ను తిట్టిపోసి ఇక్కడికొచ్చారు. ఇదెక్కడి వైఖరి.. అని ముషారఫ్‌ మండిపడ్డారు. మోదీ.. పాక్‌ పర్యటనకు తాను అంత ప్రాధాన్యం ఇవ్వడం లేదని ముషారఫ్‌ తేల్చిచెప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : India  pakistan  Pathankot  Pervez Musharraf  

Other Articles