Indian Railway unveils train coaches with new and refurbished look

Indian railway unveils train coaches with new and refurbished look

Indian Railways, Indian Rails, Suresh prabhu, Modi, Renovation, train coaches with new, refurbished look

Enhancing passenger amenities coupled with adequate fire safety measures, railways on Monday unveiled refurbished coaches with aesthetically appealing and improved interior furnishings. This is a step towards providing better amenities to passengers and we will continue to do so in future also, Railway Minister Suresh Prabhu said here after inspecting the new coaches here.

రైల్వే కోచ్ లలో రాజభోగాలు.. ఆధునీకరణ అంటే ఇదే

Posted: 01/12/2016 01:29 PM IST
Indian railway unveils train coaches with new and refurbished look

బారత రైల్వేల గురించి కొత్తగా చెప్సక్కర్లేదు. ప్రపంచంలోని రవాణాలో మన వాటా తక్కువేమీ కాదు. ప్రజా రవాణాలో ఇండియన్ రైల్వేలు నాలుగుశాతం భాగస్వామ్యం వహిస్తున్నాయి అంటే ఎంత బాగా మన రైల్వే నడుస్తోందో అర్థమవుతోంది. అయితే భారత రైల్వేకున్న ప్రధాన లోపం.. అధునీకరణ లేకపోవడం. తాతల కాలం నాటి బోగీలతో జనాలు విసిగిపోయారు. అయితే మోదీ సర్కార్ వచ్చినప్పటి నుండి పరిస్థితి కాస్త మారింది. రైల్వేల్లో శుభ్రత పెరగడం.... మెంటెనెన్స్ కూడా బాగా ఉండటం మంచి పరిణామం. అయితే తాజాగా రైల్వే మంత్రి సురేష్ ప్రభు.. రైల్వేలను అధునీకరించేందుకు పూనుకున్నారు. రైల్వేలను రాజసౌధాలుగా, అత్యాధునికంగా తీర్చిదిద్దుతున్నారు.

భారత రైల్వేల్లో కొత్త తరహా కోచ్ లను పరిచయం చేస్తున్నారు. అందులో భాగంగా కంట్రోల్డ్ డిస్ చార్జ్ వాటర్ ట్యాప్, కొత్త టాయిలెట్ లు, ఆధునిక ఫ్యాన్, ఎల్ఈడీ లైట్లు, స్నాక్ టేబుల్స్ ఇలా అన్ని హంగులతొ కొత్తగా బోగీలు రూపుమార్చుకుంటున్నాయి. కొత్తగా రైళ్లు, రైళ్వే లైన్లు కాకుండా రైళ్లను ఆధునీకరిస్తామని మోదీ గతంలోనే ప్రకటించారు. అందులో భాగంగా రైల్వే శాఖ తాజాగా చేస్తున్న మార్పులు ప్రయాణికులకు మరో కొత్త అనుభూతిని ఇవ్వనున్నాయి. ఎసీ-1, ఏసీ-2, స్లీపర్ బోగీలను అధునీకరించనున్నారు. ఒక్క బోగీని మార్చడానికి 25 లక్షల దాకా ఖర్చవుతోందని.. 111 బోగీలను ఆధునీకరించడానికి 31.5 కోట్లు ఖర్చైందని వెల్లడించారు రైల్వే అధికారులు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Indian Railways  Indian Rails  Suresh prabhu  Modi  Renovation  train coaches  

Other Articles