Nara Lokesh tweets on TRS party

Nara lokesh tweets on trs party

Nara Lokesh, Lokesh, TRS, Lokesh Tweets, Lokesh on TRS party

TDP Party leader nara Lokesh slams TRS party for its Two faced TRS proves it again. He tweeted that One that cries foul at settlers for votes, another that sympathises them, again for votes.

వాళ్లది మొసలి కన్నీరు అంటూ లోకేష్ ట్వీట్

Posted: 01/10/2016 01:49 PM IST
Nara lokesh tweets on trs party

గ్రేటర్ హైదరాబాద్ లో ఎన్నికల నగరా మోగింది.. ఒక్కో పార్టీ ఒక్కోలా దూసుకెళుతోంది. అన్ని పార్టీలు కూడా విజయం కోసం అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నాయి. ముఖ్యంగా టిఆర్ఎస్ పార్టీ అయితే ఈ సారి కూడా ఎన్నికల్లో తన ప్రతాపాన్ని చూపించాలని చూస్తోంది. అందుకే ఎన్నికల నగారాకు ముందు నుండే గల్లీగల్లీలో కారు జోరుమీద ఉంది. అయితే టిఆర్ఎస్ పార్టీ మీద తెలుగుదేశం పార్టీ ఆశాకిరణం లోకేష్ బాబు ట్విట్టర్ లో దాడి చేశారు. ఎన్నికల సందర్భంగా టిఆర్ఎస్ తీరు మీద ఆయన మాటలు సందించారు.

గతంలో చాలా సార్లు ట్విట్టర్ వేదికగా లోకేష్ మాటల తూటాలు పేల్చారు. అందుకే లోకేష్ బాబుకు ట్విట్టర్ పిట్ట అని కూడా ప్రతిపక్షాలు పేరుపెట్టాయి. తాజాగా జీహెచ్ఎంసీ ఎన్నికలను పురస్కరించుకుని మరోమారు ఆ పార్టీపై విమర్శలు గుప్పించారు. జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో సెటిలర్ల ఓట్లను కొల్లగొట్టేందుకు టీఆర్ఎస్ యత్నిస్తోందని ఆయన ఆరోపించారు. ఇందుకోసం వారి పట్ల సానుకూల వ్యాఖ్యలు చేస్తూ మొసలి కన్నీరు కారుస్తోందని ఆయన విరుచుకుపడ్డారు. లోకేశ్ ట్వీట్లపై మరోమారు టీడీపీ, టీఆర్ఎస్ ల మధ్య మాటల తూటాలు పేలడం ఖాయంగానే కనిపిస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Nara Lokesh  Lokesh  TRS  Lokesh Tweets  Lokesh on TRS party  

Other Articles