Kalanikethan MD Leela kumar Arrested

Kalanikethan md leela kumar arrested

Leela kumar, Kalanikethan MD, Leela kumar Arrested, Kalaniketan Managing Director Leela Kumar

Textile major Kalaniketan Managing Director Leela Kumar and his wife, Sarada Kumari have been arrested by CCS police for taking loans worth over hundred of crores scam and not returning them. They owed crores money to Private financiers and 200 crores money from Gujarath Business persons.

కళానికేతన్ ఎండీ లీలాకుమార్ ఎగ్గొట్టుడులీలలు

Posted: 01/10/2016 01:28 PM IST
Kalanikethan md leela kumar arrested

దొరికితే దొంగ లేదంటే దొర అని మన పెద్ద వాళ్లు సామెత చెబుతూ ఉంటారు. అయితే దొంగలే దొరలుగా మారుతున్నారు... లేదంటే దొరలుగా మారిన తర్వాత దొంగబుద్దులు వస్తున్నాయో అర్థంకావడం లేదు. లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా దగ్గరి నుండి కళానికేతన్ లీలాకుమార్ వరకు అందరూ ఒకటే పాలసీని ఫాలోఅవుతున్నారు. బ్యాంకులు, వడ్డీ వ్యాపారుల నుంచి భారీగా గుంజాడు.. కళానికేతన్ ఎండీ లీలా కుమార్. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో దాదాపు రూ.800 కోట్ల మేర ఇలా అప్పులు చేసినట్లు తెలుస్తోంది. అయితే.. అప్పులు తీసుకోవడమే తప్ప.. వాటిని తిరిగి చెల్లించలేదు. హైదరాబాద్ కు చెందిన ఏవీఎన్ రెడ్డి దగ్గర 3 కోట్లు అప్పుగా తీసుకున్నారు లీలాకుమార్, అతని భార్య శారద. కళానికేతన్ లో భాగస్వామ్యం ఇస్తామంటూ ఆయన్ను నమ్మించారు. కానీ.. ఇవ్వలేదు. ఎన్నిసార్లు అడిగినా డబ్బు ఇవ్వలేదు. ఇలానే మరో ఆరుగురి దగ్గరా దాదాపు 70 కోట్ల మేర వసూలు చేశారు. వీరంతా డబ్బు ఇవ్వాలంటూ ఒత్తిడి తేవడంతో పాటు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే.. దీనిపై దర్యాప్తు చేసిన పోలీసులు.. లీలాకుమార్ లీలలను కనిపెట్టారు. ఈలోగా.. ఏవీఎన్ రెడ్డి తమను మోసం చేశారంటూ ఫిర్యాదు చేయడంతో.. లీలాకుమార్ ను, శారదను అరెస్ట్ చేశారు.

గతంలోనూ సీసీఎస్ లో లీలాకుమార్ పై రుణం తీసుకుని ఎగ్గొట్టారనే అరోపణలతో కేసులు నమోదయ్యాయి. మొత్తం తెలంగాణ, ఏపీలో 8 బ్యాంకులకు 800 కోట్ల దాకా మోసం చేసినట్లు గుర్తించారు పోలీసులు. ఇందులో హైదరాబాద్ లో 5 బ్యాంకులు, విజయవాడలో 2 బ్యాంకులు, గుంటూరులో 1 బ్యాంకు నుంచి భారీ మొత్తంలో రుణాలు తీసుకున్నారు..అంతేకాదు ఒకే భూమికి చెందిన ఫోర్జరీ పత్రాలను వేర్వేరు బ్యాంకుల్లో తాకట్టు పెట్టి రుణాలు పొందినట్లు గుర్తించారు. తీసుకున్న రుణాలను తిరిగి చెల్లించకపోవడంతో బ్యాంకు అధికారులు పలుమార్లు నోటీసులు జారీ చేశారు. అయినా స్పందించకపోవడంతో ఆస్తులను సీజ్ చేయాలని నిర్ణయించారు. ఒక బ్యాంకుకు తెలియకుండా మరో బ్యాంకులో ఆస్తులు తనఖా పెట్టినట్లు గుర్తించిన అధికారులు వెంటనే అప్రమత్తమై రిజర్వ్ బ్యాంకు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. అయితే లీలా కుమార్ పై కావాలనే కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని.. ఏవీఎన్ రెడ్డే దౌర్జన్యంగా వ్యవహిరించాడని ఆరోపిస్తున్నారు లీలా కుమార్ అడ్వకేట్.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles