Russian viral video of doctor hitting patient who dies

Russian viral video of doctor hitting patient who dies

Doctor, Patient, Russian Doctor, CCTV footage, Russian Doctor killed patient

The incident took place in the city of Belgorod, 670km (440 miles) south of the capital, Moscow, on 29 December. The patient had earlier kicked a nurse, after which the doctor punched him in the head, Russian media reported. Investigators think it was a case of "involuntary manslaughter", one official told Russian TV, but have launched a criminal case. The story went viral after the CCTV footage came to light.

రోగిని పిడిగుద్దులతో చంపిన డాక్టర్

Posted: 01/10/2016 05:07 PM IST
Russian viral video of doctor hitting patient who dies

కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడినట్లైంది ఓ రష్యాలో ఓ రోగి పరిస్థితి. అనారోగ్యంతో బాధపడుతూ ఆస్పత్రికి వెళితే పాపం అక్కడ వైద్యం చేయాల్సిన డాక్టర్ పిడిగుద్దులతో కొట్టి చంపేశాడు. అయితే ఇక్కడ పేషెంట్ సైడ్ కూడా తప్పు ఉంది. తనను ట్రీట్ చెయ్యడానికి వచ్చిన ఓ నర్సతో ఆ పేషంట్ అసభ్యంగా ప్రవర్తించాడట. అంతే ఇంకేముంది ఆ నర్సు వెళ్లి డాక్టర్ గారి దగ్గర బోరున విలపించడంతో డాక్టర్ గారు కోపంతో ఊగిపోయారు. కోపంతో ఏమి చేస్తున్నాడో కూడా తెలియని పరిస్థితి డాక్టర్ ది.

రష్యాలోని బొల్ గోరోడ్ నగరంలోని ఓ ఆస్పత్రిలో జరిగింది. తన పంచ్ ల దెబ్బకు రోగి చనిపోయాడని తెలుసుకున్న డాక్టర్ అతనిని బత్రికించే ప్రయత్నం చేశాడు. అయినా ఫలితం లేకుండాపోయింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ ప్రారంభించారు. ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరా ఈ ఘటన మొత్తాన్ని రికార్డ్ చేసింది. ఆ వీడియో దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. అయినా డాక్టర్ గారికి ఎంత కోపం వస్తే మాత్రం వైద్యం కోసం వచ్చిన పేషంట్ ను కొట్టి చంపేయడం ఏంటి అని అందరూ అనుకుంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Doctor  Patient  Russian Doctor  CCTV footage  Russian Doctor killed patient  

Other Articles