No Need Fashion Karnataka Governor said

No need fashion karnataka governor said

Karnataka, Vajubhai R Vala, Vajubhai R Vala statements, Vajubhai R Vala contraversy, Vajubhai R Vala on women fashion

Karnataka governor Vajubhai R Vala triggered a fresh controversy on Thursday while addressing students during the valedictory event of the 103rd Indian Science Congress in Mysuru.

అమ్మాయిలు ఫ్యాషన్ వద్దంటున్న గవర్నర్

Posted: 01/09/2016 11:32 AM IST
No need fashion karnataka governor said

అసలే అమ్మాయిలు.. వాళ్లను అందంగా తయారుకావద్దు.. ఫ్యాషన్ కు దూరంగా ఉండండి అని ఎవరైనా చెబుతారా..? ఎవ్వరూ చెప్పరు కానీ ఓ రాష్ట్ర గవర్నర్ గారు మాత్రం చెప్పారు. అమ్మాయిలు ఫ్యాషన్ ను వదిలివేయాలని సూచించారాయన. అమ్మాయిలు తమ ఫ్యాషన్ మీద దృస్టిసారించవద్దు అని అంటున్నారు. అమ్మాయిలకే కాదు అబ్బాయిలకు కూడా ఆయన క్లాస్ తీసుకున్నారు. ఇంతకీ ఎవరా గవర్నర్, ఎక్కడ జరిగింది ఈ ఘటన అని అనుకుంటున్నారా అయితే మొత్తం స్టోరీ చదవాల్సిందే.

ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ ముగింపు సమావేశానికి హాజరైన కర్ణాటక గవర్నర్ వాజూభాయి అమ్మాయిలు, అబ్బాయిల మీద తీవ్ర వ్యాఖ్యలు చేశారు.  ‘అమ్మాయిలూ... ఫ్యాషన్ యావ వీడండి’ అంటూ ఆయన పిలుపునిచ్చారు. తనదైన శైలిలో సెటైరికల్ యాసలో వాజూభాయ్ చేసిన ప్రసంగానికి కార్యక్రమానికి హాజరైన కాలేజీ గర్ల్స్ కూడా చప్పట్లతో స్వాగతం పలికారు. ‘‘కాలేజీ అబ్బాయిలతో పాటు అమ్మాయిలు కూడా తేలివైన వారే. జీవితంలో సాధించాలనుకున్న దాని కోసం కొన్నింటిని త్యాగం చేయాలి. అబ్బాయిలు దుర్వ్యసనాలను వీడాలి. అమ్మాయిలు ఫ్యాషన్ యావ నుంచి బయటపడాలి. అమ్మాయిలు... మీరు కాలేజీకి వస్తోంది చదువుకోవడానికే కాని ఫ్యాషన్ వీక్ లో పాల్గొనేందుకు కాదు. మీరు కనుబొమలను తీర్చిదిద్దుకోవడం, లిప్ స్టిక్ పూసుకోవడం, కురులను ట్రిమ్ చేసుకోవాల్సిన అవసరం లేదు’’ అంటూ వాజూభాయ్ పేర్కొన్నారు. గతంలో కూడా వాజూభాయ్ ఇలాంటి వివాదంలోనే ఇరుక్కున్నారు. ఓ పక్క జాతీయగీతం ఆలపిస్తుంటే గౌరవించకుండా.. నడుచుకుంటూ వెళ్లిపోవడం తీవ్ర దుమారాన్ని రేపుతోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles