tension in Medak Ibrahimpur

Tension in medak ibrahimpur

Medak, Ibrahimpur, Clash in Ibrahimpur

Tension prevails in Ibrahimpur and Jillella villages, following group clashes over the lynching of a youth by Ibrahimpur villagers. Lakshmi, sarpanch of Ibrahimpur of Siddipet mandal in Medak district, was accidentally hit by a biker, Srihari. The villagers thrashed the boy, leading to his death in the hospital due to the injuries. Consequently, Jillella villagers protested before the sarpanch's house with the dead body. They later set fire to her house.

ITEMVIDEOS: రణరంగంగా మారిన ఇబ్రహీంపూర్... టెన్షన్ టెన్షన్

Posted: 01/09/2016 12:37 PM IST
Tension in medak ibrahimpur

మెదక్ జిల్లా సిద్దిపేట మండలంలోని ఇబ్రహీంపూర్ అట్టుడికిపోయింది. స్వల్ప ఘటనతో మొదలైన పంచాయితీ.. ఒకరి మృతితో మెదక్, కరీంనగర్ జిల్లాల్లోని రెండు గ్రామాల మధ్య యుద్ధానికి వేదికైంది. ఇబ్రహీంపూర్‌లో కరీంనగర్ జిల్లా సిరిసిల్ల మండలం జిల్లెల్ల గ్రామస్థులు ఓ ఇంటికి నిప్పుపెట్టారు. మంటలు ఆర్పేందుకు వచ్చిన ఫైరింజన్‌ను అడ్డుకున్నారు. మీడియాను అనుమతించలేదు. టీవీ రిపోర్టర్‌పై దాడిచేసి కెమెరా పగులగొట్టారు. పోలీసులపైనా ప్రతాపం చూపించారు.

ఇబ్రహీంపూర్ సర్పంచ్ లక్ష్మిని శ్రీరాం శ్రీహరి అనే వ్యక్తి తన టూ వీలర్ తో ఢీకొట్టాడని చెప్పి.. లక్ష్మి కుమారులు, మరికొందరు కలిసి శ్రీహరిని తీవ్రంగా కొట్టారు. అయితే శ్రీహరి తాను ఎవరిని బైక్ తో కొట్టలేదని చెప్పినా కానీ వినిపించుకోలేదు. అయితే మరో వ్యక్తి దానికి కారణం అని తెలుసుకొని అతడిని వదిలిపెట్టారు. అయితే తీవ్ర గాయాలపాలైన శ్రీహరి అస్వస్తతకు గురికావడంతో ఆస్పత్రికి తరలించారు. తీవ్ర గాయాలతో  నోటి నుండి రక్తం కక్కుకుని శ్రీహరి మరణించాడు. దాంతో ఆగ్రహించిన శ్రీహరి తరఫు బంధువులు సర్పంచ్ లక్ష్మి, ఆమె కుమారులు, మరికొందరి మీద దాడికి పాల్పడ్డారు. దాంతో ఇబ్రహీంపూర్ లో భయానక వాతావరణం ఏర్పడింది. ఎప్పుడు ఏం జరుగుతుందో అన్న భయాందోళన నెలకొంది. ఓ ఐజీ, ఇద్దరు ఎస్పీలు ఘటనా స్థలాన్ని పరిశీలించారు.ఓ చిన్న ఘటన తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. అయితే ప్రస్తుతానికి శాంతి భద్రతలు అదుపులోనే ఉన్నయని పోలీసులు అంటున్నా కానీ అక్కడ మాత్రం ఆ పరిస్థితి కనిపిచడం లేదు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Medak  Ibrahimpur  Clash in Ibrahimpur  

Other Articles