Central govt remove ban on Jallikattu but cock fights in ap is not ok

Central govt remove ban on jallikattu but cock fights in ap is not ok

Jallikattu, Cock Fight, AP, Tamilnadu

Central govt remove ban on Jallikattu but cock fights in ap is not ok. On elections central govt remove the ban on jallikattu.

జల్లికట్టుకు ఓకే.. మరి కోడిపందేలాకు...?

Posted: 01/09/2016 11:07 AM IST
Central govt remove ban on jallikattu but cock fights in ap is not ok

తమిళనాడు ప్రజలు ఈసారి పొంగల్‌కు జల్లికట్టు జోరుగా నిర్వహించుకోవచ్చు. ఎద్దుల్ని జనాల మధ్య పరుగెత్తించి తమాషా చూసే ఈ వివాదాస్పదమైన ఆటపై నాలుగేండ్లుగా కొనసాగుతున్న నిషేధాన్ని కేంద్రం ఎత్తివేసింది. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కేంద్రం సమర్పించుకున్న ఈ పొంగల్ కానుకపై తమిళనాడులో ఆనందోత్సాహాలు వ్యక్తమవుతున్నాయి. జల్లికట్టుపై నిషేధం ఎత్తివేసినందుకు ప్రధాని నరేంద్రమోదీకి తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత కృతజ్ఞతలు తెలిపారు. అయితే జల్లికట్టు మీద నిషేదాన్ని ఎత్తివేస్తూ కేంద్రం తీసుకన్న నిర్ణయంతో ఏపిలో కోడిపందేల అంశం తెర మీదకు వచ్చింది.  

జల్లికట్టు తరహాలోనే మన ఆంధ్రప్రదేశ్‌లోనూ కొన్ని చోట్ల అలాంటి ఉత్సవాలు జరుగుతుంటాయి. గ్రామాల్లో ఎద్దులు, ఆవుల్ని పరుగులు పెట్టించి, వాటితో పరుగులు పెడ్తుంటారు. ఇక్కడా అనేక సందర్భాల్లో మరణాలో చోటుచేసుకున్నాయి. 'సంప్రదాయ క్రీడ' పేరుతో రక్తం చిందించడంపై జంతు ప్రేమికులు, మానవ హక్కుల సంఘాల నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జల్లికట్టుకు లేని నిషధం కోడి పందాలపై ఎందుకని అంధ్ర ప్రదేశ్ లో పందాలు కట్టేవారు ప్రశ్నిస్తున్నారు. అయితే కోడిపందేల మీద హైకోర్టు తీవ్రంగా మండిపడటంతో ఏపి సర్కార్ కోడిపందేల మీద కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటామని కోర్టుకు వెల్లడించింది. మరి జల్లికట్టుకు లేని నిషేదం కోడిపందేలకు ఎందుకు అని ప్రశ్న వినిపిస్తోంది. పైగా కోడిపందేలు ఎంతో కాలంగా సంప్రదాయంగా కొనసాగుతున్నయని కూడా వాదిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Jallikattu  Cock Fight  AP  Tamilnadu  

Other Articles