Telangana CM KCR Flexis in AP

Telangana cm kcr flexis in ap

KCR, East Godavari, Ap, Contract Employees, KCR Flexi in AP

Telangana CM gain more fans in AP also. Some group of employees banned a flexi of KCR in East Godavari.

కేసీఆర్ కు ఏపిలో ఫ్లెక్సీలు

Posted: 01/09/2016 10:25 AM IST
Telangana cm kcr flexis in ap

అవును.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఏపిలో ఫ్యాన్స్ పెరిగిపోయినట్లు కనిపిస్తోంది. అందుకే ఏపిలో తాజాగా కేసీఆర్ కు ఫ్లెక్సీలు కట్టిమరీ తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. మొన్నీమధ్యనే తెలంగాణ మంత్రి, కేసీఆర్ కుమారుడు కేటీఆర్ ఏపిలో తాను భీమవరం నుండి పోటీచేస్తానని వెల్లడించారు. కేసీఆర్ కు తెలంగాణలోనే కాదు ఏపిలో కూడా ఫాలోయింగ్ ఉంది అని వెల్లడించారు. కేటీఆర్ అలా మాట్లాడిన రెండు రోజుల తర్వాత కేసీఆర్ ఫ్లెక్సీలు ఏపిలో ప్రత్యక్షమయ్యాయి. అది కూడా కేసీఆర్ కు అభినందనలు తెలుపుతూ ఓ సంఘం ఫ్లెక్సీలు కట్టడం వార్తల్లో నిలుస్తోంది. అసలే ఏపిలో కేసీఆర్ ఫ్లెక్సీలు ఎందుకు వచ్చాయో తెలుసుకోవాలంటే మొత్తం స్టోరీ చదవండి.

ఇటీవల కాంట్రాక్టు ఉద్యోగుల సర్వీసులను క్రమబద్ధీకరించిన కేసీఆర్‌ నిర్ణయం తీసుకున్నారు. దీనిపై ఆయనకు అభినందనలు తెలుపుతూ ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా వై.రామవరం మండల కాంట్రాక్టు ఉద్యోగుల సంఘం కేసీఆర్‌కు ఫ్లెక్సీలు కట్టింది. ‘తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ కాంట్రాక్టు ఉద్యోగుల చీకటి జీవితాలకు వెలుగును ప్రసాదించిన ముఖ్యమంత్రి వర్యులు’ అన్న విశేషణంతో ‘శతకోటి అభివందనములు’ చెబుతూ స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల రోడ్లో ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. అయితే ఈ ఫ్లెక్సీలు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును అవమానించడం అవుతుందని అక్కడ స్థానిక టీడీపీ నేతలు వాటిని తొలగించాలని పంచాయతీ కార్యదర్శిని కోరారట.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : KCR  East Godavari  Ap  Contract Employees  KCR Flexi in AP  

Other Articles