GHMC Elections Notification Released

Ghmc elections notification released

GHMC, GHMC Notification, GHMC Elections2016, Elections Commission

GHMC elections 2016 which is being conducted for first time after formation of Telangana state there is much discussion on voter list and court cases finally High court ordered government of Telangana to complete GHMC Elections 2016 by 31st January 2016.

ఫిబ్రవరి2న జీహెచ్ఎంసీ ఎన్నికలు..5న ఫలితాలు

Posted: 01/08/2016 06:41 PM IST
Ghmc elections notification released

మొత్తానికి జిహెచ్ఎంసీ ఎన్నికల నగారా మోగింది. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న జిహెచ్ఎంసీ ఎన్నికల శంకారావం నేటికి వినిపించింది. జీహెచ్ఎంసీ ఎన్నికల షెడ్యూల్ ను ప్రకటించిన ఎన్నికల సంఘం.. నేటి నుండి ఎన్నికల కోడ్ అమలులోకి వస్తుందని కూడా ప్రకటించింది. ఫిబ్రవరి 2న జీహెచ్ ఎంసీలో 150 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. జనవరి 12 నుంచి 17 వరకు నామినేషన్ల స్వీకరణ జరగుతుందని, జనవరి 18న నామినేషన్లు పరిశీలన చేసి, 21న నామినేషన్ల ఉపసంహరణ జరుపుతామని, ఫిబ్రవరి 2న ఎన్నికలు నిర్వహించి, 5వ తేదీన ఓట్లు లేక్కించి ఫలితాలను వెల్లడిస్తామని ఎన్నికల సంఘం తెలిపింది.

ఏదైనా వార్డులో అనివార్య కారణాలతో పోలింగ్ ఆగితే ఫిబ్రవరి 4న తిరిగి ఎన్నికలు నిర్వహిస్తామని తెలిపారు. జీహెచ్ఎంసీ ఎన్నికల షెడ్యూల్ ను 15 రోజులకు కుదిస్తూ తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన జీవోపై హైకోర్టు గురువారం స్టే విధించిన సంగతి తెలిసిందే. రిజర్వేషన్లను వెంటనే ప్రకటించాలని కోర్టు ఆదేశించడంతో రేపటిలోగా ప్రకటిస్తామని ప్రభుత్వం చెప్పింది. దీనికి ముందుగా శుక్రవారమే రిజర్వేషన్లు ప్రకటించింది. అందుకు అనుగుణంగా ఎన్నికల సంఘం కూడా అత్యంత వేగంగా ఎన్నికల షెడ్యూల్ ను ప్రకటించడం విశేషం..

GREATER HYDERABAD MUNICIPAL CORPORATION Number of wards: 150

Number of seats reserved for the category           General     Women     Total
Scheduled Tribes (STs)ఎస్టీలకు కేటాయించినవి               01            01           02
Scheduled Castes (SCs)ఎస్సీలకు కేటాయించినవి            05            05          10
Backward Classes (BCs)బిసిలకు కేటాయించినవి             25             25          50 
Women (General) ఉమెన్ జనరల్                             -                44          -
Un-reserved రిజర్వ్ చెయ్యనివి                                  44               -             -
మరిన్ని వివరాలకు సంప్రదించండి... http://www.ghmc.gov.in/

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : GHMC  GHMC Notification  GHMC Elections2016  Elections Commission  

Other Articles