Mega Mao' no more as ridiculed golden statue destroyed

Mega mao no more as ridiculed golden statue destroyed

Mao Zedong , golden statue, China, golden statue destroyed, central China

A giant golden statue of Mao Zedong has been torn down in central China just days after the 36-metre effigy sparked an outpouring of criticism and ridicule. Photographs of Henan province’s “mega Mao”, which had reportedly been built in a rural corner of Tongxu county at a cost of 3m yuan (about £312,000), went viral this week after appearing on a Chinese website.

భారీ మావో విగ్రహం నేలమట్టం

Posted: 01/09/2016 09:21 AM IST
Mega mao no more as ridiculed golden statue destroyed

చైనాలో ఎంతో అట్టహాసంగా ఏర్పాటు చేసిన కమ్యూనిస్టు పార్టీ వ్యవస్థాపక చైర్మన్ మావో జెడాంగ్ విగ్రహాన్ని అనుమతులు లేవనే కారణంతో అధికారులు కూల్చివేశారు. బంగారు పూతతో ఉన్న 37 మీటర్ల పొడవు ఉన్న భారీ విగ్రహాన్ని 4.6 లక్షల అమెరికా డాలర్ల వ్యయంతో తొంగ్సూ కౌంటీ సమీపంలోని కైఫెంగ్‌లో ఉన్న హెనన్ ప్రావిన్స్‌లో మావో అభిమానులు, పార్టీ కార్యకర్తలు ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. గతవారం నెలకొల్పిన భారీ విగ్రహం ప్రపంచవ్యాప్తంగా అన్ని మీడియాల్లో పతాక శీర్షికలను ఆకర్షించింది. రిజిస్ట్రేషన్ నమోదు, ఆమోదం లేకపోవడం మావో విగ్రహాన్ని కూల్చివేశామని స్థానిక అధికారులు మీడియాకు వెల్లడించారు.

కార్మికులు, కర్షకులు అందించిన నిధులతో నిర్మించిన తమ అభిమాన నాయకుడు మావో విగ్రహం కూల్చివేయడంపై అభిమానులు, కార్యకర్తలు మండిపడ్డారు. మావో విగ్రహ ఏర్పాటును పార్టీలోని కొంతమంది వ్యతిరేకిస్తున్నారు. మావో పాలనకాలంలో పేదరికం గరిష్ఠస్థాయికి చేరుకొన్నదనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. మావో మరణించిన తర్వాత అధికారాన్ని చేపట్టిన డెంగ్ జిన్‌పింగ్ చైనాను ఆర్థిక పరిస్థితి మెరుగుపరిచేలా సంస్కరణలు చేపట్టారనే వాదన వినిపిస్తున్నది. హునన్‌లో నిర్వహించిన మావో 122వ జయంతి ఉత్సవాల్లో ఆయన పాలనపై పార్టీకి చెందిన నేతలు దుమ్మెత్తిపోసిన సంగతి తెలిసిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Mao Zedong  golden statue  China  golden statue destroyed  central China  

Other Articles