Mehbooba likely to be sworn in as J&K CM soon

Mehbooba likely to be sworn in as j k cm soon

PDP MP Mehbooba Mufti , Mehbooba, Jammu and Kashmir Chief Minister, Mufti Mohammad Sayeed, Jammu and Kashmir, Mufti Mohammad Sayeed passed

With the budget session of the Jammu and Kashmir Assembly set to begin and Chief Minister Mufti Mohammad Sayeed still in hospital, PDP MP Mehbooba Mufti may be sworn in as chief minister soon, sources said. The change of guard — which would make Mehbooba the first woman CM of the state — could take place if Sayeed’s condition does not improve in a week, the sources added

ముఫ్తీ కూతురు జమ్ము కాశ్మీర్ సిఎం..!

Posted: 01/07/2016 10:37 AM IST
Mehbooba likely to be sworn in as j k cm soon

జమ్ము కాశ్మీర్ ముఫ్తీ మొహ్మద్ సయిద్ మరణించారు. అనారోగ్యం కారణంగా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు.  పీడీపీ-బీజేపీ కూటమిగా ఏర్పడడంతో ముఫ్తీ మహ్మద్ గత ఏడాది మార్చి నెలలో జమ్మూ కశ్మీర్ సీఎంగా బాధ్యతలు స్వీకరించారు. 2002లో కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకున్న ముఫ్తీ అప్పట్లో మూడేళ్లు సీఎంగా బాధ్యతలు నిర్వర్తించారు. ముఫ్తీ మరణంతో ఆయన కూతురు మెహబూబాకు సీఎం పదవిని చేపట్టనున్నారు. పీడీపీ అధ్యక్షురాలిగా ఉన్న మెహబూబా త్వరలో జమ్మూ కశ్మీర్ సీఎంగా బాధ్యతలు స్వీకరిస్తారని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

తన కూతురు మెహబూబా సీఎం బాధ్యతలు స్వీకరిస్తుందని గత ఏడాది నవంబర్ 13న ముఫ్తీ మహ్మద్ ఓ సందర్భంలో సూచించారు. జమ్మూ కశ్మీర్ ప్రజలతో మెహబూబాకు మంచి సంబంధాలు ఉన్నాయని, ఆమె సీఎం పోస్టుకు అర్హురాలని ముఫ్తీ అన్నారు. కశ్మీర్ లోయలో పీడీపీ పార్టీ పుంజుకోవడానికి మెహబూబా తీవ్రంగా కృషి చేస్తున్నారు. మిలిటెంట్ల ప్రభావానికి గురైన ప్రాంతాల్లో ఆమె తరుచూ పర్యటిస్తున్నారు. 15 ఏళ్ల క్రితం పీడీపీ పార్టీ ఏర్పడ్డ నాటి నుంచీ మెహబూబా చురుగ్గా పనిచేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles