Jammu Kashmir CM Passes away

Jammu kashmir cm passes away

Jammu and Kashmir Chief Minister, Mufti Mohammad Sayeed, Jammu and Kashmir, Mufti Mohammad Sayeed passed

Jammu and Kashmir Chief Minister Mufti Mohammad Sayeed passed away at the AIIMS hospital in New Delhi earlier on Thursday. He was 79. Sayeed was admitted to the hospital on December 24 with complaints of neck pain and fever. Over the last few days, doctors had put him on ventilator support after his condition deteriorated.

జమ్ము కాశ్మీర్ సిఎం మృతి

Posted: 01/07/2016 10:12 AM IST
Jammu kashmir cm passes away

జమ్మూ కశ్మీర్ ముఖ్యమంత్రి ముఫ్తీ మహమ్మద్ సయీద్ ఈ ఉదయం దిల్లీలో కన్నుమూశారు. గతకొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఎయిమ్స్లో చికిత్స పొందిన సంగతి తెలిసిందే. ఆరోగ్యం మరింత క్షీణించడంతో ఆయనను బుధవారం ఐసీయూకు తరలించారు. కాగా ముఫ్తీ మహ్మద్ అనారోగ్యం కారణంగా జమ్ము కాశ్మీర్ అసెంబ్లీ సమావేశాల మీద డైలామా కొనసాగింది. సిఎం ఆరోగ్యం కుదుటపడిన తర్వాత అసెంబ్లీ సమావేశాలను నిర్వహించే తేదీలను ఖరారుచేస్తామని ప్రభుత్వం ప్రకటించింది కూడా. కానీ అంతలోనే ముఖ్యమంత్రి కన్నుమూశారు.

ముఫ్తీ కూతురు జమ్ము కాశ్మీర్ సిఎం..!

ముఫ్తీ కూతురు జమ్ము కాశ్మీర్ సిఎం..!

ముఫ్తీ మహమ్మద్ సయీద్ 1987లో కాంగ్రెస్ పార్టీలో కొనసాగారు. 1987లో ఫరుఖ్ అబ్దుల్లా ప్రభుత్వం పడిపోవడానికి ప్రధాన కారణం ముఫ్తినే అంటారు. ఆ తర్వాత ఆయన వీపీ సింగ్‌ నేతృత్వంలోని జన్‌ మోర్చాలో చేరి.. దేశ తొలి హోంమంత్రిగా 1989లో వరకు కేంద్ర మంత్రిమండలిలో కొనసాగారు. ఆ తర్వాత మళ్లీ కాంగ్రెస్‌ గూటికి చేరి పీవీ నరసింహారావు హయాంలో పనిచేశారు. 1999లో కాంగ్రెస్‌తో తెగదెంపులు చేసుకొని కూతురు మహబూబా ముఫ్తీతో కలిసి జమ్ముకశ్మీర్ పీపుల్ డెమొక్రటిక్ పార్టీని స్థాపించారు. 2002 అసెంబ్లీ ఎన్నికల్లో పీడీపీ 18 సీట్లు గెలువడంతో కాంగ్రెస్‌ పార్టీతో పొత్తు పెట్టుకొని సంకీర్ణ ప్రభుత్వ ముఖ్యమంత్రిగా తొలిసారి ప్రమాణ స్వీకారం చేశారు. తాజా అసెంబ్లీ ఎన్నికల్లో పీడీపీ అత్యధిక సీట్లు సాధించడంతో బీజేపీతో చేతులు కలిపి మరోసారి ముఖ్యమంత్రి అధిరోహించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles