This Vine Of A Robbery In Amritsar Is Absolutely Terrifying

This vine of a robbery in amritsar is absolutely terrifying

Amritsar, Amritsar Robbery, CCTV footage

This Vine Of A Robbery In Amritsar Is Absolutely Terrifying. This CCTV footage of a robbery taking place in Amritsar hit the internet.

ITEMVIDEOS: వామ్మో.. ఏడు సెకన్లలో దోపిడీ

Posted: 01/07/2016 10:10 AM IST
This vine of a robbery in amritsar is absolutely terrifying

కేవలం ఏడంటే ఏడు సెకన్లలో దోపిడీ జరిగిపోయింది. ఏం జరిగిందో తెలుసుకునేలోపే డబ్బులతో ఉడాయించారు. మారుతున్న కాలంతో పాటు దొంగతనం చేస్తున్న వారు కూడా స్పీడైనోయారు. అందుకే కంటిరెప్పపాటులోనే సొమ్ములతో ఉడాయిస్తున్నాయి. అయితే తాజాగా పంజాబ్ లో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. ఓ మహిళ కారులో వెళ్తుండగా బైక్‌పై వెంబడించిన ఇద్దరు దుండగులు.. కారు ఆగగానే చెలరేగారు. ఇంటికి చేరుకోగానే.. సదరు మహిళ.. గేట్‌ లోపలికి కారు తీసుకెళ్లేందు.. అలా అపారో..లేదో.. రెప్పపాటులో బైక్‌ పై నుంచి దిగిన ఓ దుండగుడు.. పెద్ద బండ రాయిని కారు అద్దానికేసి బలంగా విసిరాడు. అద్దం బద్దలవగానే.. కారులోని డబ్బు సంచీ తీసుకుని తాపీగా అక్కడి నుంచి వెళ్లి బైక్‌ ఎక్కాడు. క్షణాల్లో జరిగి పోయిన ఈ ఘటన బాధిత మహిళ ఇంటి ముందున్న సీసీ కెమెరాలో రికార్డయింది.

అంతా క్షణాల్లోనే జరిగిపోయింది. అసలు ఏం జరిగిందో తెలుసుకునే లోగానే అంతా అయిపోయింది. కళ్ల ముందే కారులో ఉన్న డబ్బు సంచి లూటీ అయ్యింది. దుండగుడు బండరాయిని కారు అద్దానికికేసి బలంగా కొట్టడంతో.. ఆ రాయి డ్రైవింగ్‌ సీట్‌లో ఉన్న మహిళకు తాకింది. బాధిత మహిళ తేరుకునేలోగా దొంగలు బైక్‌ పై పరారయ్యారు. ఈ ఘటన పంజాబ్‌లో సంచలనం సృష్టించింది. రెప్పపాటులో జరిగిన ఈ దోపిడీ మరింత అప్రమత్తతో ఉండాలని తెలియజేస్తోంది. అయితే పోలీసులు ఈ ఘటన పై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Amritsar  Amritsar Robbery  CCTV footage  

Other Articles