Asaduddin Owisi called to not to join into ISIS

Asaduddin owisi called to not to join into isis

ISIS, Asadudin Owisi, Owisi, Owisi on Muslims

MP Asaduddin Owisi called to muslim youth to not to join into ISIS. He also slamed searching Islam in internet.

అందులో చేరకండి అంటున్న అసదుద్దీన్

Posted: 01/04/2016 12:47 PM IST
Asaduddin owisi called to not to join into isis

ప్రపంచవ్యాప్తంగా మతం పేరుతో మారణకాండకు పాల్పడుతున్నఇస్లామిక్ స్టేట్ లాంటి మత సంస్థలు ఇస్లాంను రెచ్చగొట్టేందుకు పుట్టుకొస్తున్నాయని ఎంఐఎం నేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ అభిప్రాయపడ్డారు. వాటి నుంచి యువత జాగ్రత్తగా ఉండాలని అసదుద్దీన్  హెచ్చరించారు. మహబూబ్ నగర్ జిల్లా పరిషత్ మైదానంలో జమాతే ఇస్లామిక్ సంస్థ నిర్వహించిన సదస్సులో ఆయన కేంద్ర ప్రభుత్వ తీరుపై నిప్పులు చెరిగారు. ఎం.ఐ.ఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ తనదైన స్టైల్ లో మాటల తూటాలు పేల్చారు. మహబూబ్ నగర్ జిల్లా పరిషత్ మైదానంలో జరిగిన సభలో.. కేంద్ర ప్రభుత్వ తీరును ఎండగట్టారు. ముస్లిం యువతకు హెచ్చరికలు జారీ చేశారు. ప్రపంచవ్యాప్తంగా టెర్రర్ సృష్టిస్తున్న ఐఎస్ఐఎస్ పై నిప్పులు కురిపించారు. ఇంటర్నెట్ లో తెలుసుకునేది అసలైన ఇస్లాం కాదంటూ చురకలంటించారు.

ఇప్పుడున్న ఇస్లాం యువకులకు.. వారి తల్లిదండ్రులు మతం గురించి సరిగ్గా వివరించడం లేదన్నారు అసదుద్దీన్. ఇంటర్ నెట్ లో చూసి చాలామంది యువకులు ఐసిస్ కు దగ్గరవుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇస్లాంకు, ఐసిస్ కు చాలా దూరం ఉందన్నారాయన. ఐసిసి స్ లాంటి సంస్థల నుంచి యువత జాగ్రత్తగా ఉండాలని ఓవైసీ సూచించారు. ప్రస్తుతం దేశాన్ని బీజేపీ పరిపాలిస్తుండొచ్చు. కానీ మనల్ని పరిపాలించేది మాత్రం ఆ  అల్లా మాత్రమే అన్నారు ఆయన. ఆయన ఆదేశానుసారమే మనం పాలించబడుతున్నామన్నారు అసదుద్దీన్. ముఖ్యంగా ప్రధాని మోడీపై నిప్పులు చెరిగారు అసదుద్దీన్. లండన్ కి వెళ్లిన ప్రధాని మోడీ.. ఇస్లామ్ లో.. సూఫీయిజం ఉందని ప్రచారం చేస్తున్నారు అంటూ ఆరోపించారు. ఆ పేరుతో ఆయన ఇస్లాంను విడగొట్టడానికి ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ISIS  Asadudin Owisi  Owisi  Owisi on Muslims  

Other Articles