YSRCPhas demanded that the AP Government maintain transparency

Ysrcphas demanded that the ap government maintain transparency

AP, Amaravati, AP Capital, Amaravati capital of ap, YSRCP, Bosta Satyanarayana

The YSR Congress Party has demanded that the Andhra Pradesh State Government maintain transparency in its dealings relating to capital city construction by placing the documents relating to the new capital in public domain.

సింగపూర్ ఒప్పందాలను బయటపెట్టాలి

Posted: 12/30/2015 08:52 AM IST
Ysrcphas demanded that the ap government maintain transparency

రాజధాని నిర్మాణం కోసం సింగపూర్‌తో రాష్ట్ర ప్రభుత్వం కుదర్చుకున్న ఒప్పం దాలను బయట పెట్టాలని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ నేత బొత్స సత్యనారాయణ డిమాండ్‌ చేశారు. రాజధాని నిర్మాణంలో టిడిపి దోపిడీ విధానం కారణంగా లక్షల కోట్ల ప్రజాధనం దుర్వినియోగ మవుతోందని ఆయన విమర్శించారు. సామా న్యుల నుంచి సేకరించిన వేలాది ఎకరాలను సింగపూర్‌ ప్రయివేటు సంస్థలకు ఇస్తునందున, ప్రభుత్వంతో ఒప్పందాలు చేసుకున్న సింగపూర్‌ ప్రతినిధులు ఇప్పుడు తమ పదవులకు రాజీనామాలు చేసి ప్రయివేటు కంపెనీలకు సిఇఒలుగా వెళ్తున్నారని తెలిపారు. ప్రవర్తన మార్చుకోవాలని చంద్రబాబు లోకేశ్‌కు చెప్పాలే గాని, ఒఎస్‌డి అభీష్ట రాజీనామా వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదన్నారు. కాల్‌మనీ సెక్స్‌ రాకెట్‌లో నిందితులందరినీ ఇంతవరకు ఎందుకు అరెస్ట్‌ చేయలేదో చెప్పాలని డిమాండ్‌ చేశారు.

తాత్కాలిక సచివాలయం పేరుతో ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్నారని వైసీపీ నేత బొత్స సత్యనారాయణ ఆరోపించారు. రాజధానికి మేం వ్యతిరేకం కాదని.. టిడిపి దోపిడీ విధానాన్ని వ్యతిరేకిస్తున్నామని తెలిపారు. సింగపూర్ ఒప్పందాల ముసుగు గురించి ప్రజలకు వాస్తవాలు చెప్పాలని డిమాండ్ చేశారు. సింగపూర్ ప్రభుత్వంతో కాకుండా ప్రైవేట్ సంస్థలతో ప్రభుత్వం ఒప్పందాలు కుదుర్చుకుంటుందని పేర్కొన్నారు. తాము, తమ పార్టీ అమరావతి నిర్మాణానికి వ్యతిరేకం కాదని.. కానీ ప్రభుత్వం అవలంభిస్తున్న విధానలకు వ్యతిరేకం అని ఆయన వెల్లడించారు. ప్రభుత్వ, ప్రైవేట్ బాగస్వామ్యం మీద కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నియమాలను పాటించకుండా.. గ్లోబల్ టెండర్లు లేకుండా ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : AP  Amaravati  AP Capital  Amaravati capital of ap  YSRCP  Bosta Satyanarayana  

Other Articles