Not scared of CBI, order any inquiry: Arvind Kejriwal on DDCA scam

Ddca official sought sex for selection arvind kejriwal

Arvind Kejriwal, DDCA, Sex racket, AAP, Arvind Kejriwal, Arun Jaitley, Aam Aadmi Party, Commission of Inquiry Act, Cricket, DDCA Row, Gopal Subramanium, Lalu Prasad Yadav, Memorandum of Procedure, Najeeb Jung, Niira Radia, Politics, Sports, Supreme Court

Delhi chief minister Arvind Kejriwal on Tuesday accused an unnamed official in the Delhi and District Cricket Association (DDCA) of asking for sex in return for selection of cricketers.

డిడిసిఏ ముసుగులో అవినీతే కాదు సెక్స్ రాకెట్ కూడా..

Posted: 12/29/2015 06:38 PM IST
Ddca official sought sex for selection arvind kejriwal

ఢిల్లీ జిల్లా క్రికెట్ అసోసియేషన్(డీడీసీఏ)లో అవినీతితో పాటు సెక్పు రాకెట్ కార్యకలాపాలు కూడా జరిగాయని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరోపించారు. అయితే డిడీసీఎ విషయమై తమ ప్రభుత్వం అవినీతిని తవ్వకం ప్రారంభించగానే డిడీసీఎ ముసుగులో జరిగిన అన్ని విషయాలు వెలుగు చూస్తున్నాయని ఆయన అన్నారు. డీడీసీఏలోని అధికారులు సెలక్షన్స్ కోసం వెళ్లిన వారి పట్ల అనైతికంగా ప్రవర్తిస్తున్నారంటూ మండిపడ్డారు. క్రికెటర్ల ఎంపికలో భాగంగా కొడుకుని తీసుకుని డీడీసీఏ అధికారుల వద్దకు వెళ్లిన ఓ సీనియర్ జర్నలిస్టుకు  ఎదురైన చేదు అనుభవం తాజాగా  తన దృష్టికి వచ్చిందని ఈ సందర్భంగా కేజ్రీవాల్ పేర్కొన్నారు.

'ఓ సీనియర్ జర్నలిస్టు నా వద్దకు తీసుకొచ్చాడు. ఈ సందర్భంగా డీడీసీఏలో చోటు చేసుకున్న విషయాల్ని నాతో చర్చించాడు. కుమారుని క్రికెట్ జట్టు సెలక్షన్ కోసం వెళితే అతని భార్యను శారీరక సుఖం కోసం పంపమని ఓ డీడీసీఏ అధికారి అడిగాడట. స్వయంగా అతనే ఈ విషయాన్ని నాతో మొరపెట్టుకున్నాడు. ఆ జర్నలిస్టు పేరును బయటకు చెప్పాలనుకోవడం లేదు. డీడీసీఏలో జరుగుతున్న అవతవకలకు ఇంతకన్నా నిదర్శనమేమిటి?, ఇదొక్కటే కాదు.. ఈ తరహా ఘటనలు అక్కడ అనేకం చోటు చేసుకుంటున్నాయి. 'అని అరవింద్ కేజ్రీవాల్ ధ్వజమెత్తారు. డీడీసీఏలో ఆర్థిక అవకతవకలు అనేది ఒక కోణమైతే..అక్కడ సెక్స్ రాకెట్ లాంటి మరోకోణం నడుస్తుందని కేజ్రీవాల్ విమర్శించారు. ఇప్పటికైనా డీడీసీఏలో అవినీతిపై విచారణను అడ్డుకోవద్దని ప్రధాని నరేంద్ర మోదీకి సూచించారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Arvind Kejriwal  DDCA  Sex racket  AAP  Arun Jaitley  

Other Articles