Lashkar e Taiba Fearing about Modi

Lashkar e taiba fearing about modi

Modi, Terror, Attack, Pakistan, Lashkar-e-Taiba

Days after Prime Minister Narendra Modi's visit to Pakistan, intelligence agencies have issued an alert regarding terror attacks by Lashkar-e-Taiba (LeT) at various locations in the country during New Year. According to the intelligence reports, Prime Minister Narendra Modi and Parliament building may be on the radar of the terror group.

లష్కరేకు మోదీ భయం

Posted: 12/30/2015 08:54 AM IST
Lashkar e taiba fearing about modi

అదేంటి మామూలుగా అయితే ఉగ్రవాద సంస్థలు చంపేస్తామంటూ హెచ్చరికలు జారీ చేస్తాయి.. ఆ దిశగా పాపులర్ పొలిటికల్ లీడర్లను హతమార్చడానికి తమ వారిని ఉసిగొల్పుతాయి. మరి టాప్ మోస్ట్ ఉగ్రవాద సంస్థల్లో ఒకటిగా ఉన్న లష్కరే తోయిబా ఇప్పుడు భారత ప్రధాని మోదీకి భయపడుతోంది. అదేంటి ఉగ్రవాద సంస్థ మోదీకి భయపడటం ఏంటీ అనుకుంటున్నారా..? అయితే మొత్తం స్టోరీ చూడండి. పాకిస్ధాన్ తో భారత ప్రధాని మోదీ అనుసరిస్తున్న వ్యూహాలు.. ఆయన చూపిస్తున్న స్నేహబంధం ఎప్పటికైన తమ పతనానికి దారి తీస్తాయని ఉగ్రవాదుల్లో భయం పట్టుకుంది.

దాంతో ఇరు దేశాల సత్సంబంధాలు మెరుగుపడితే తమ ఆటలు సాగవని భావించారో ఏమో గానీ.. ప్రధాని మోదీపై లష్కరే తాయిబా గురిపెట్టింది. ఈ విషయాన్నే భారత నిఘా వర్గాలు వెల్లడించాయి. న్యూ ఇయర్ రోజున దేశంలో ప్రధాని, ముఖ్యమంత్రుల నివాసాలే లక్ష్యంగా దాడులకు లష్కరే తాయిబా కుట్ర పన్ని సుమారు 15-20 మంది ఉగ్రవాదులను సరిహద్దు దాటించిందని భారత ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరించాయి. ప్రధానితో పాటుగా భారత పార్లమెంటు, సైన్యం ప్రధాన కార్యాలయం, అణు కేంద్రాలకు లష్కరే తాయిబా నుంచి ముప్పు పొంచి ఉందని తాజా హెచ్చరికలో నిఘా వర్గాలు తెలిపాయి. ఈ హెచ్చరికలతో దేశం మొత్తం అలర్ట్ అయ్యింది. ముఖ్య నగరాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Modi  Terror  Attack  Pakistan  Lashkar-e-Taiba  

Other Articles