Computer name for girl child

Computer name for girl child

computer, proton, nutron, electron, chennai, Chennai people, new names for new born babies

The decision by a young Hindu couple, Mohan and Chitra, to name their newborn girl child Yunus as a sign of gratitude to the man who rescued them from their marooned house at Urappakkam, Chennai has raised eyebrows among those who do not know the back ground. They believe the choice is curious due to the religious factor as also the gender. However, people of Tamil Nadu, for a long time, have a penchant for selecting unique names for their children. Here are a few of such names and the reasons behind for christening them as such.

ఆ అమ్మాయి పేరు కంప్యూటర్

Posted: 12/29/2015 04:09 PM IST
Computer name for girl child

అవును మీరు చదువుతున్నది కరెక్టే.. అమ్మాయి పేరు కంప్యూటరే. అదేంటి ఏ పేర్లు లేవన్నట్లు కంప్యూటర్ అని పేరు పెట్టుకోవడం ఏంటా అనుకుంటున్నారా..? మామూలుగా ఏ శ్రీనివాసో .జగదీషో.. లేదంటే ఇంకేదో పేరు పెట్టుకుంటుంటారు. కానీ కొంత మంది మాత్రం డిఫరెంట్ గా ఉండాలని కొత్త కొత్త పేర్లు పెట్టుకుంటుంటారు. అయితే మరికొందరు తమ అభిమానాన్ని, ప్రేమను చాటిచెప్పడానికి కూడా తమ వారి పేర్లను పెట్టుకుంటుంటారు. ఉదాహరణకు ఏడుకొండల వెంకన్న స్వామి భక్తుడు ఉంటే తన కొడుక్కు ఏ శ్రీనివాస్ అనో, వెంకటేష్ అనో పేరు పెట్టుకుంటాడు. అలాగే ఓ మేధావి తన కూతురికి కంప్యూటర్ అని పేరు పెట్టుకున్నాడు. అంతేకాదు మరో వ్యక్తి తన పిల్లలకు ప్రోటాన్, న్యూట్రాన్, ఎలక్ర్టాన్ అని పేరు పెట్టాడు. అసలు స్టోరీ ఏంటో తెలుసుకోవాలంటే మొత్తం స్టోరీ చదవండి.

తమిళనాడులోని పుదుక్కోట్టై జిల్లా కొత్తమంగళానికి చెందిన రచయిత ఎం.ఎం.కన్నన్ తన కుమార్తెలకు ‘కంప్యూటర్’ (కనిని), ‘ఇంటర్నెట్’ (ఇనైయ) అని పేర్లు పెట్టి సైన్స్ అంటే తనకున్న అభిమానాన్ని చాటుకున్నారు. చెన్నైకి సమీపంలోని బీఎస్ఎన్ఎల్ ఉద్యోగి అరుల్దాస్ కుటుంబాన్ని అందరూ ‘అటామిక్ ఫ్యామిలీ’ అంటారట. అందుకు కారణం.. ఆయన తన ముగ్గురు పిల్లలకు పెట్టిన పేర్లే. ఆయన పెద్ద కుమారుడు ‘ప్రోటాన్’, రెండో కుమారుడు ‘న్యూట్రాన్’, చిన్న కుమారుడి పేరు ‘ఎలక్ట్రాన్’. న్యూట్రాన్ డిప్లొమా, ప్రొటాన్ ఐటీఐ పూర్తి చేస్తే... ఎలక్ట్రాన్ 12వ తరగతి చదువుతున్నాడు. మొత్తానికి ఇలా డిఫరెంట్ గా పేర్లు పెడుతూ చెన్నై వాసులు కొత్త ట్రెండ్ స్టార్ట్ చేశారు. చూడాలి మరి మరికొన్ని రోజులుపోతే సాష్ట్ వేర్ల పేర్లు కూడా పెట్టుకుంటారేమో...?

(source: Indianexpress.com)

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : computer  proton  nutron  electron  chennai  Chennai people  new names for new born babies  

Other Articles