తాను ఓ రిటైర్డు ఆర్మీకి చెందిన వ్యక్తి. ఆపదలో వున్నవారిని అందరిలా చూస్తూ ఊరుకోలేడు. అందుకనే తన కళ్ల ఎదుట కొన్ని క్షణాల్లో జరుగుతున్న ఓ మరణాన్ని అపాలని యోచించి.. అవకాశం లేకపోయినా అడ్డుకునేందుకు యత్నించాడు. చివరకు తన ప్రాణాలపైకి తెచ్చుకన్నాడు. తన ప్రయత్నం విఫలమో కావచ్చు.. కానీ అతని సంకల్పం మాత్రం గొప్పది. పదకొండవ అంతస్తు పైనుంచి కింద పడబోతున్న ఒక మహిళను పట్టుకుబోయిన ఒక మాజీ సైనికుడికి గాయాలైన సంఘటన చైనాలో జరిగింది. సీసీటీవీ ఫుటేజ్ ద్వారా ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది.
ఈ నెల 23వ తేదీన సెంట్రల్ చైనాలోని హుబీ ప్రావిన్స్ లో ఉన్న ఎన్షీ సిటీలో ఫెంగ్ నింగ్ అనే యువకుడు అక్కడి రెస్టారెంట్ లోంచి బయటకు వస్తున్నాడు. సమీపంలో ఉన్న ఒక నివాస భవనం నుంచి పెద్దగా అరుపులు, కేకలు పెడుతున్న ఒక గొంతు విన్పించింది. అతను పరీక్షగా చూశాడు. 11వ అంతస్తు కిటికీకి వేలాడుతున్న ఒక మహిళను గమనించాడు. ఆ భవనం కింద కొంతమంది స్థానికులు ఆ మహిళను చూస్తూ నిలబడి ఉన్నారు. వెంటనే ఆ భవనం వద్దకు వెళ్లి నిలబడ్డాడు.
పైనుంచి కిందపడేందుకు సిద్ధంగా ఉన్న ఆ మహిళను పట్టుకునేందుకు అతను రెండు చేతులు చాచి సంసిద్ధమవుతుండగా... ఆమె అతని చేతుల మీదుగా కింద పడింది. ఆ బరువుకి అతను కూడా కింద పడ్డాడు. ఇదంతా సెకన్ల వ్యవధిలో జరిగిపోయింది. ఈ సంఘటనలో ఫెంగ్ నింగ్ మోకాళ్లకు, చేతులకు గాయాలయ్యాయి. అయితే, అన్ని అంతస్తుల పై నుంచి కిందపడ్డ మహిళ మాత్రం ప్రాణాలు వదిలింది. కాగా, ఫెంగ్ నింగ్ ను వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటనపై ఫెంగ్ నింగ్ మాట్లాడుతూ, ఆ మహిళను కాపాడలేకపోయినందుకు తనకు చాలా అవమానంగా ఉందని అన్నాడు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో యూ ట్యూబ్ లో హల్ చల్ చేస్తోంది.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more