BJP demands Congress leader's arrest for remarks on PM, Smriti Irani

Tension flares in assam over controversial comment against smriti irani

tension Flares In Assam, Controversial Comment Against Smriti Irani, Assam, Guwahati, BJP, Congress, Smriti Irani, Nilamani Sen Deka, Tarun Gogoi, smriti irani, assam, controversial remark, mla sen deka PM, mla sen deka Smriti Irani, mla sen deka controversial comments, bjp demands congress leaders arrest, congress leader, smriti irani, bjp chief sonowal, sonia gandhi, appology

A police complaint was filed against Assam Congress legislator Nilamani Sen Deka today for making controversial remarks against Union Minister Smriti Irani and PM Modi.

క్షమాపణలు చెప్పినా.. వినిపించుకోని బీజేపి.. పెద్ద ఎత్తున అందోళనలు

Posted: 12/29/2015 12:20 PM IST
Tension flares in assam over controversial comment against smriti irani

కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ, ప్రధాని నరేంద్రమోడీలపై అస్సాం ఎమ్మెల్యే నిలమోని సేస్ డేక వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో ఆ రాష్ట్రంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పరస్పర దాడులకు దిగారు. దీంతో గౌహతిలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ, ప్రధాని మోదీ రెండవ భార్య అంటూ ప్రజల్లో అరోపణలు వస్తున్నాయంటూ అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే సెన్ డేకా తన తప్పును తెలుసుకుని ఆ తరువాత క్షమాపణలు చెప్పారు. అంతేకాదు తన వ్యాఖ్యలను తాను ఉపసంహరించుకుంటున్నానంటూ కూడా తెలిపారు. అయితే బీజేపీ శ్రేణులు మాత్రం ఎమ్మెల్యే డేకా ఒక్కడే కాదు ముఖ్యమంత్రి తరుణ్ గగోయ్ కూడా క్షమాపణలు చెప్పాలని బీజేపీ డిమాండ్ చేస్తూ అందోళన కార్యక్రమాలకు దిగింది.

దీంతో గౌహతిలో కాంగ్రెస్ ప్రధాన కార్యాలయం ముందు బీజేపీ మద్దతుదారులు పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు. కాంగ్రెస్ కార్యకర్తలపై కర్రలతో దాడికి పాల్పడ్డారు. దీంతో ఇరువర్గాలు ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకున్నారు. ఆ అలజడి కొందరు గాయపడ్డారు. ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడటంతో పాటు పరిస్థితి అదుపు తప్పింది. రంగంలోకి దిగిన పోలీసులు లాఠీచార్జ్‌కు దిగారు. జీఎస్ రోడ్డులోని కాంగ్రెస్ కార్యాలయం వద్ద పోలీసులు టియర్ గ్యాస్‌ను ప్రయోగించారు. బీజేపీ కార్యకర్తలు తమపై రాళ్లు రువ్వారని కాంగ్రెస్ కార్యకర్తలు ఆరోపించారు. అయితే తాము మాత్రం నిమ్మకుండిపోయామన్నారు

కాగా, ఈ ఉద్రిక్తతో బిజేపీ కార్యర్తలు పలు ప్రజా, ప్రైవేటు అస్తులను ధ్వంసం చేశారు. దీంతో పాటు 27 మంది కాంగ్రెస్ నేతలపై దాడులకు పాల్పడగా, వారిలో ఏడుగురు పరిస్థితి విషమంగా వుంది. విధ్వంసానికి దిగిన బీజేపీ కార్యకర్తలపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. ఎమ్మెల్యే సేన్ డేకా వ్యాఖ్యలను ముఖ్యమంత్రి తరుణ్ గగోయ్ తీవ్రంగా తప్పుపట్టారు. అస్సాంలో సోమవారం పర్యటించిన స్మృతి ఇరానీ వివాదాస్పద వ్యాఖ్యలపై స్పందించారు. అసోంలో మహిళలకు ఏ మాత్రం గౌరవం లభిస్తుందో డేకా వ్యాఖ్యలే దర్పణం పడుతున్నాయని, ఇందుకు రానున్న అసెంబ్లీ ఎన్నికలలో ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని అమె అన్నారు. అయితే నోరుజారిన కాంగ్రెస్ ఎమ్మెల్యే డేకా.. తన తప్పుకు క్షమాపణలు చెప్పిన తరువాత కూడా బీజేపి శ్రేణులు ఎందుకు అందోళనకు దిగుతున్నారన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : smriti irani  assam  controversial remark  mla sen deka  

Other Articles