Online firm Canvera successfully raises Rs.15 crores from InfoEdge

Online firm canvera successfully raises rs 15 crores from infoedge

InfoEdge, Canvera Photography Company, Canvera, Photography Company

Leading and fully integrated Photography Company Canvera has successfully raised Rs. 15 crores from existing investor InfoEdge this month to support aggressive growth plans and product development.

కన్వేరా ఫోటోగ్రఫీ కంపెనీలో ఇన్ఫోఎడ్జ్ 15కోట్ల పెట్టుబడి

Posted: 12/29/2015 12:42 PM IST
Online firm canvera successfully raises rs 15 crores from infoedge

ఆన్ లైన్ ఫోటోగ్రఫీ సైట్ కన్వేరా కంపెనీ అంతకంతకు విస్తరిస్తోంది. ఇంటగ్రేటెడ్ ఫోటోగ్రఫి కంపెనీగా కన్వేరా ప్రస్తుతం మార్కెట్ లో టాప్ పొజిషన్ లో కొనసాగుతోంది. అయితే తాజాగా ఇన్ఫోఎడ్జ్ సంస్థ కన్వేరాలో 15 కోట్ల పెట్టుబడులు పెట్టింది. కన్వేరా చేస్తున్న ప్రాడక్ట్, డెవలప్ మెంట్ లో ఇన్ఫోఎడ్జ్ ఈ పార్ట్ నర్ షిప్ తో పాలుపంచుకుంటుంది. ఇండియాలో 700 నగరాలకు పైగా కన్వేరా విస్తరించి ఉంది. మార్కెట్ లో లీడ్ కొనసాగించడంలో భాగంగా అక్టోబర్ లో కొత్త రేంజ్ లో ఫోటో బుక్ ను రిలీజ్ చేసింది. ఇండస్ట్రీలో మొదటి మెమొంటో రేంజ్ బుక్ కూడా ఇదేకావడం విశేషం.

కన్వేరా కంపెనీ యాప్ ద్వారా కూడా తన మార్కెట్ ను పెంచుకుంటోంది. కొన్ని రోజుల క్రితమే వచ్చిన యాప్ కూడా కస్టమర్లకు బాగా చేరవవుతోంది. ఇప్పటికే 15వేల మార్క్ తో యాప్ కూడా కన్వేరాను టాప్ లో ఉంచుతోంది. దాదాపు 10 వేల మంది ఫోటోగ్రాఫర్స్ కన్వేరాతో కలిసి 700 నగరాల్లో పనిచేస్తున్నారు. ఇన్ఫోఎడ్జ్ తో కలిసి పని చెయ్యడం, వారితో పార్ట్ నర్ షిప్ తమకు ఎంతో ఆనందంగా ఉందని కన్వేరా సిఈఓ రంజిత్ యాదవ్ వెల్లడించారు. కన్వేరా బిజినెస్ అభివృద్దికి, ప్రాడక్ట్ డెవలప్ మెంట్ కోసం 15 కోట్లు పెట్టుబడిగా పెడుతున్నామని ఇన్ఫోఎడ్జ్ సిఎఫ్ఓ చింతన్ టక్కర్ తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : InfoEdge  Canvera Photography Company  Canvera  Photography Company  

Other Articles