Telangana govt facing Helmet headache in High court

Telangana govt facing helmet headache in high court

chain snatching, Telangana, Helmets, High Court, chain snatchers

High court asked the Telanagana govt on Complesary Helmet rule. Telanagana AG said that some chain snatchers useing helmets while chain snatching

ప్రభుత్వానికి హెల్మెట్ ల తలనొప్పి...?

Posted: 12/28/2015 04:15 PM IST
Telangana govt facing helmet headache in high court

ప్రభుత్వం ఎందుకు హెల్మెట్ వాడకాన్ని తీసుకురాలేకపొతోంది. అన్న ప్రశ్నకు.. వచ్చిన సమాధానంతో హైకోర్ట్ లో జడ్జిలకు నవ్వొచ్చింది. నిజానికి హెల్మెట్ ల వాడుకం మీద ప్రజలకు అవగాహన తీసుకురావాలని.. వారు హెల్మెట్ వాడేలా చూడాలని ప్రభుత్వానికి హైకోర్ట్ ఆదేశాలు జారీ చేసింది. అందులో భాగంగా పలు కార్యక్రమాలను కూడా నిర్వహించాలని.. హెల్మెట్ దరించని వారిపట్ల కటువుగా ప్రవర్తించాలని కూడా కోర్టు వెల్లడించింది. అయితే ప్రభుత్వం మాత్రం హెల్మెట్ వాడకం మీద ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. ప్రభుత్వ విధానాన్ని హైకోర్టు తప్పుపట్టింది.

హెల్మెట్ వాడకాన్ని ఖచ్చితంగా పాటించేలా ఎందుకు చెయ్యడం లేదు అన్న దానికి సమాధానంగా.. గత కొంత కాలంగా రాజధానితో పలు నగరాల్లో చైన్ స్నాచర్లు ఎక్కువయ్యారని.. వారిని గుర్తించడం సిసిటివి కెమెరాల్లో కష్టంగా ఉందని అందుకే హెల్మెట్ తప్పనిసరి అన్న నిబంధనను అమలు చెయ్యలేకపోతున్నామని ప్రభుత్వం తరఫు లాయరు వాదించారు. దీని మీద స్పందించిన హైకోర్టు ఇలాంటి సమాధానాలు వింటే జనాలు నవ్వుకుంటారని.. ఇలాంటివి తమకు చెప్పొద్దని హితవు పలికింది. ఇక మీదట హెల్మెట్ ధరించని వారికి హెల్మెట్ కంటే ఎక్కువ ఫైన్ విధించాలని కోర్ట్ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : chain snatching  Telangana  Helmets  High Court  chain snatchers  

Other Articles