వాళ్లంతా మధ్యతరగతి ఉన్నత శ్రేణికి చెందిన మహిళలు. మధ్యాహ్నం పూట కాలక్షేపం కావడం లేదని ఏకంగా తమ నివాసాన్నే పేకాట స్థావరంగా మార్చేశారు. ఇలా రోజులు గడిచే కొద్ది ఆపీసులకు వెళ్లే భర్తలను సాగనంపగానే.. ఏకంగా డబ్బు, దస్కం పట్టుకుని తమ స్థావరానికి వచ్చి తమ పని కానిస్తున్నారు. దీంతో ఎలాగోలా ఉప్పందుకున్న పోలీసులు పేకట స్థావరంపై దాడిచేసి ఏడుగురు మహిళలను పోలీసులు అరెస్ట్ చేశారు.
వివరాలిలా ఉన్నాయి.. నగరంలోని చైతన్యపురి గ్రీన్ హిల్స్ కాలనీలోని ఓ అపార్టుమెంట్ ఫ్లాటులో పేకాట క్లబ్ నిర్వహిస్తున్నారని పోలీసులకు సమాచారం అందింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు పేకాట ఆడుతున్న ఏడుగురు మహిళలను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ. 26 వేల నగదుతో పాటు ఏడు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. స్థానిక కాలనీలోని ఓ ఇంట్లో ఒక మహిళ మూడు ముక్కలాట క్లబ్ నిర్వహిస్తోందనే సమాచారంతో రంగంలోకి దిగిన చైతన్యపురి పోలీసులు పేకాట ఆడుతున్న ఏడుగురిని అరెస్ట్ చేశారు.
వీళ్లందరినీ చైతన్యపురి పోలీసులకు అప్పగించారు. ఈ మహిళలంతా వ్యాపారవేత్తల కుటుంబాలకు చెందినవారని తెలుస్తోంది. అసలు తెలంగాణ పరిధిలో ఎక్కడా పేకాట క్లబ్బులను అనుమతించేది లేదని సీఎం కేసీఆర్ స్పష్టంగా చెబుతుండగా, మరోవైపు మహిళలు ఇలా డబ్బులతో పేకాట ఆడటం విస్మయం కలిగించిందని ఎస్ఓటీ పోలీసులు అంటున్నారు. గతంలో కూడా ఇలాంటి ఘటన ఈ ప్రాంతంలో జరిగింది. గతంలో రోడ్ నెం.2లో కొంతమంది మహిళలు పేకాట ఆడారని పోలీసులు చెబుతున్నారు.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more